తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ముందుగా ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంతా భావించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుత్తాను మంత్రి వర్గంలోకి తీసుకుంటే స్థానికంగా పార్టీలో వర్గాలు ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని సీఎం భావించినట్లు సమాచారం. సుఖేందర్‌తో మాట్లాడి మండలి ఛైర్మన్ పదవిని తీసుకోవాలని... కేసీఆర్ సూచించినట్లు తెలిస్తోంది. ఉపఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని... అందులో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమావేశాల్లోనే గుత్తాను ఛైర్మన్ పదవిలో నియమించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి : 'జల్ జీవన్‌కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు'