కరోనాను ఎదుర్కొనేందుకు శరీరానికి విటమిన్ 'సీ' అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోని ఉద్యోగులకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బత్తాయి పండ్లను అందజేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి తానే స్వయంగా సంచుల్లో నింపి.. నల్గొండ నుంచి అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు, తెరాస శాసనసభాపక్ష కార్యదర్శి రమేశ్ రెడ్డి పండ్లను అసెంబ్లీ, మండలి ఉద్యోగులకు పంపిణీ చేశారు.
![gutta sukender reddy fruits distribution to the workers at assembly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6926790_gjj.jpg)
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్