రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలలో పొరుగు సేవల ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, మ్యూజిక్ సబ్జెక్ట్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు సంబంధించిన అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు www.tgtwgurukulam.telangana.gov.inలో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.