ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ గుంజన్ సొంతూరు. ఆర్మీ కుటుంబం.‘నేను పైలట్ అవుతాన’ని తండ్రితో చెప్పింది. కూతురు లక్ష్యం చేరడానికి దారి చూపించాడా తండ్రి. 1994లో తొలిసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 25 మంది మహిళలను పైలెట్‌గా ఎంపిక చేశారు. అందులో గుంజన్ ఒకరు. కార్గిల్ యుద్ధం సమయంలో గుంజన్ చీతా హెలికాప్టర్ ఎక్కింది. బేస్‌క్యాంప్ నుంచి కొండలు దాటుకుంటూ.. సైనిక స్థావరాలకు వెళ్లిపోయేది. ఆహారం, ఔషధాలు భద్రంగా అప్పగించేది. వేగంగా, శత్రువుల శతఘ్నులకు చిక్కకుండా మెరుపు వేగంతో ప్రధాన స్థావరానికి చేరుకునేది. గాయపడిన సైనికులను హెలికాప్టర్‌లో వేసుకొని బేస్‌క్యాంప్‌కు క్షేమంగా తరలించేది గుంజన్. యుద్ధభూమిలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళా పైలెట్‌గా రికార్డును సొంతం చేసుకుంది. ‘ఆపరేషన్ విజయ్’లో సమర్థవంతమైన బాధ్యతను నిర్వర్తించిన గుంజన్‌కు శౌర్యచక్ర బిరుదును ప్రదానం చేశారు. కార్గిల్ గాళ్‌గా పేరుగాంచింది.
'కార్గిల్ గాళ్' గుంజన్ సక్సేనా గుర్తుందా? - కార్గిల్ గాళ్ గుంజన్ సక్సేనా బాలివుడ్ చిత్రం
గగనతలం సంబరపడుతోంది.. ఆ అతివ చూపిన తెగువ జ్ఞాపకానికి వచ్చి.. 20 ఏళ్లు దాటిపోయింది ఆమె శౌర్యగాథ విని.. మళ్లీ ఆమె గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? యావద్భారతానికీ ‘కార్గిల్ గాళ్’గా సుపరిచితమైన గుంజన్ సక్సేనా పేరు ఇప్పుడు ట్విట్టర్‌లో మళ్లీ మార్మోగుతోంది. ఆమె జీవితకథ తెరకెక్కుతుండటమే ఇందుకు కారణం. శ్రీదేవి తనయ జాన్వీకపూర్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం మరో విశేషం. గుంజన్ విన్యాసాలు ఓటీటీ వేదికపై కనువిందు చేయనున్నాయి. ‘గుంజన్ సక్సేనా- ద కార్గిల్ గాళ్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌పై త్వరలో విడుదల కానుందని ప్రకటించడంతో సామాజిక మాధ్యమాల్లో ఆ వీరనారి గురించి అన్వేషణ మొదలైంది.