ETV Bharat / state

మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత.. చంద్రబాబు సంతాపం - Kuthuhalamma

Gummadi Kuthuhalamma Died: ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు.

మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత
మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత
author img

By

Published : Feb 15, 2023, 11:16 AM IST

Gummadi Kuthuhalamma passes away : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తెల్లవారుజామున ఏపీలోని తిరుపతిలో గల ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. కుతూహలమ్మ వైద్యురాలిగా పని చేశారు.

EX Minister Kuthuhalamma passes away today : ఓవైపు వైద్యురాలిగా సేవలందిస్తూ మరోవైపు తన సేవలు విస్తరించడానికి ఆమె రాజకీయాలను ఎంపిక చేసుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన కుతూహలమ్మ మొదటగా చిత్తూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్‌లో పని చేశారు. 2014వ సంవత్సరంలో కాంగ్రెస్​ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. సుమారు ఏడాదిన్నర క్రితం టీడీపీకి కూడా రాజీనామా చేశారు.

కుతూహలమ్మ 1985 సంవత్సరంలో వేపంజేరి (ప్రస్తుతం జీడీ నెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందించారు.

2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 1994లో కాంగ్రెస్‌ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత జీడీ నెల్లూరు నుంచి పోటీ చేసి ఓటమిని చవి చూశారు.

చంద్రబాబు సంతాపం..: కుతూహలమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. గుమ్మడి కుతూహలమ్మ అకాల మరణం బాధాకరమని.. ఈ వార్త తనను చాలా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఆమె సేవలు చిరస్మరణీయమన్న చంద్రబాబు.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.