ETV Bharat / state

ప్రైవేటు యూనివర్సిటీల విధివిధానాలు ఖరారు... - private universities

రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే కనీసం 20 నుంచి 30 ఎకరాల స్థలం ఉండాలని పేర్కొంది. రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలనే నిబంధన విధించింది. ఛాన్సలర్, వైస్​ఛాన్సలర్​ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒక వేళ మధ్యలోనే యూనివర్సిటీ మూసివేయాలనుకుంటే... చివరి బ్యాచ్ పూర్తయ్యే వరకూ తరగతులు కొనసాగించాలని స్పష్టం చేసింది.

ప్రైవేటు యూనివర్శిటీల విధివిధానాలు ఖరారు...
author img

By

Published : Aug 20, 2019, 11:59 PM IST

Updated : Aug 21, 2019, 9:16 AM IST

ప్రైవేటు యూనివర్సిటీల విధివిధానాలు ఖరారు...

రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. ఇటీవల ప్రైవేట్ యూనివర్సిటీల చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం... దానికి అనుగుణంగా విధివిధానాలను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేయాలంటే హెచ్ఎండీఏ పరిధిలోనైతే కనీసం 20 ఎకరాలు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కనీసం 30 ఎకరాల స్థలం ఉండాలి. తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు ఇతర అవసరాల కోసం పదివేల చదరపు మీటర్ల స్థలం కేటాయించాలని.. పరిపాలన కోసం వెయ్యి చదరపు మీటర్ల భూమి ఉండాలని షరతు విధించింది. ఛాన్సలర్ నియామకం కోసం ప్రముఖ పత్రికలు, విద్యా సంచికల్లో ప్రకటనలు ఇచ్చి... నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం చేసింది. వచ్చిన దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలించి... మూడు పేర్లను యూనివర్సిటీకి సూచిస్తుంది. వారిలో ఒకరిని విశ్వవిద్యాలయం ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.

యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే...

ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటుచేయాలనుకుంటే.. ఉన్నత విద్యామండలికి ఆన్​లైన్​లో రూ. 50 వేలు చెల్లించి దరఖాస్తు డౌన్​లోడ్​ చేసుకోవాలి. ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, రూ. 10 లక్షల రుసుముతో దరఖాస్తును రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శికి సమర్పించాలి. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్​, జేఎన్​టీయూహెచ్​, ఓయూ వీసీతో పాటు మరోఇద్దరు నిపుణులు సభ్యులుగా ఉంటారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్​ కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసే సంస్థ పేరు ప్రతిష్టలు, ఆర్థిక పరిస్థితి, అనుభవం, ప్రతిపాదిత కోర్సులు వంటి అంశాలను కమిటీ 60 రోజుల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిపార్సు చేస్తుంది. తర్వాత 30 రోజుల్లో సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం విధించిన షరతులన్నీ ప్రతిపాదిత విద్యాలయం ఆరు నెలల్లో అమలుచేసి సర్కారుకు నివేదిక ఇవ్వాలి. అవసరమైతే మరో ఆరు నెలల గడువు కోరవచ్చు. యూనివర్సిటీ ఏర్పాటైన తొలి మూడేళ్లలో ఆరు నెలలకొకసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. మూడేళ్ల అనంతరం ఏడాదికోసారి నివేదిక పంపించాలి.

విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.10 కోట్ల మూలనిధి, మరో రూ. 30 కోట్లు.. విశ్వవిద్యాలయం, కళాశాల విద్యాశాఖ కమిషనర్​​ ఉమ్మడి ఖాతాలో డిపాజిట్​ చేయాలి. యూనివర్సిటీ ఏర్పాటుచేసిన నెలరోజుల్లో రూ. 10 కోట్లు లేదా ప్రాజెక్టు వ్యయంలో ఒకశాతం ఎండోమెంట్​ ఫండ్​ను ఏర్పాటుచేయాలని స్పష్టంచేసింది. ద్రవ్యోల్బణం ఆధారంగా నిధిని పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఎవరు అర్హులు..

ప్రైవేటు యూనివర్సిటీల్లోని అన్ని కోర్సుల్లో 25 శాతం సీట్లు స్థానికులకు కేటాయించాలని చట్టంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో కనీసం రెండేళ్లు చదివినా లేదా నివసించిన వారి పిల్లలు అర్హులుగా పేర్కొంది.

మధ్యలోనే మూసివేయాలనుకుంటే..

ఏదైనా కారణం వల్ల యూనివర్సిటీని మూసివేయాలనుకుంటే ముందస్తు నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం ప్రభుత్వం నియమించిన పరిశీలకుడు యూనివర్సిటీ వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. చివరి బ్యాచ్​ పూర్తయ్యే వరకు ఎండోమెంట్​ నిధులతో పాలన సాగిస్తారు. అసెంబ్లీలో చట్టం చేసి విశ్వవిద్యాలయాన్ని రద్దుచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ఇవీ చూడండి: చంద్రయాన్​-2: ఇస్రో సారథితో ఈటీవీ భారత్​ ముఖాముఖి

Last Updated : Aug 21, 2019, 9:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.