ETV Bharat / state

గ్రామీణ పేదలను కాటేస్తున్న గుడుంబా... బానిసలై కుటుంబాలు ఆగమాగం - Gudumba in Telangana Villages

Gudumba: చిత్రంలో మీరు చూస్తున్నది ఓ గుడుంబా బట్టీ. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంట శివారులో చెట్ల పొదల్లో కనిపించింది.. మిట్టమధ్యాహ్నం ఓ మహిళ అదే బట్టీలో ఇలా సారా కాస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు అతి సాధారణం.. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో పలు బట్టీలను ఎక్సైజ్‌ యంత్రాంగం ధ్వంసం చేసినా నాటుసారా తయారీ కొనసాగుతోండడం గమనార్హం.

Gudumba
Gudumba
author img

By

Published : May 3, 2022, 5:03 AM IST

Gudumba: రాష్ట్రం నుంచి గుడుంబాను తరిమికొట్టామని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అలా లేవు. హైదరాబాద్‌ ధూల్‌పేట ఒకప్పుడు గుడుంబాకు పెట్టింది పేరు.. నేడక్కడ పరిస్థితులు సద్దుమణిగినా.. పల్లెల్లో ముఖ్యంగా తండాల్లో నాటుసారా విజృంభిస్తోంది. భూపాలపల్లి, మహబూబాబాద్‌, సూర్యాపేట, గద్వాల, సంగారెడ్డి.. తదితర జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో గుడుంబా తయారీ నిరాటంకంగా నడుస్తూనే ఉంది. కొందరైతే ఏకంగా ఇళ్లలోనే బట్టీలు పెడుతోండటం యంత్రాంగానికి సవాలు విసురుతోంది. పది రోజుల క్రితం మహబూబాబాద్‌ అధికారపార్టీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ బానోత్‌ రవి హత్య వెనక నల్లబెల్లం ముఠా తగాదాలే కారణమని పోలీసులు తేల్చారు. తమ రవాణా వాహనాన్ని పట్టించాడనే కారణంతోనే రవిని మట్టుబెట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఈ పరిస్థితుల్లో భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాలోని మారుమూల మహాముత్తారం మండలంలో ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పర్యటించగా విస్మయకర విషయాలు కళ్లకు కట్టాయి. ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా బెల్లం విరివిగా లభిస్తుండటం గుడుంబా ఉద్ధృతికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రముఖ జాతరలో భారీగా వినియోగించిన బెల్లాన్ని వ్యాపారులు ఇటీవల అక్రమంగా దిగుమతి చేసుకొని నాటుసారా తయారీదారులకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.

35-40 ఏళ్లలోనే మరణశయ్యపై: మహాముత్తారం మండలం మాదారంలో గుడుంబా ఎన్నో సంసారాల్లో కల్లోలం సృష్టించింది. ఆ మత్తు కారణంగా ఏడాది కాలంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందైతే పదుల సంఖ్యలోనే మృత్యుఒడికి చేరారు. దీనికి బానిసలై పెళ్లిళ్లకు నోచని యువకులూ ఉన్నారు.

.

* ‘కొర్లకుంట తండాల నుంచి మాదారానికి నాటుసారా విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. అది తాగి మరణిస్తున్న వారిలో 35-40 ఏళ్లలోపు యువతే ఎక్కువ. ప్రస్తుతం గ్రామంలో మొహాలు ఉబ్బి మంచానికి పరిమితమైనవారితో పాటు 30 ఏళ్లొచ్చినా పెళ్లి కాకుండానే మరణశయ్యపై చేరిన యువకులూ ఉన్నారు..’ అని స్థానిక యువకుడు పంతకాని సుదర్శన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

.

* ‘గ్రామంలో అనారోగ్య మరణాలపై ఆరా తీస్తే గుడుంబా మూలకారణంగా కనిపిస్తోంది. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ సారాకు బానిసలుగా మారారు. అయినా సారా బట్టీలను మూసేయకపోవడం దారుణం..’ అని మరో స్థానికుడు గంప రాజు వాపోయారు.

ప్రేమనగరం.. నెలకో మరణం

.

చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ఇనుముల మధునమ్మ. ఈమెది మహాముత్తారం మండలం ప్రేమ్‌నగర్‌ గ్రామం. గుడుంబాకు బానిసయిన ఈమె భర్త సమ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. మధునమ్మ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా.. పదిహేడేళ్ల కొడుకు ఉన్నాడు. తమకున్న కొద్దిపాటి పొలంలో పంట సరిగా రాక కూలిచేస్తూ పొట్ట పోసుకుంటోంది. గుడిసెలో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. గుడుంబా ధాటికి కకావికలమైన కుటుంబాల్లో మధునమ్మదీ ఒకటి. ఇలాంటి కుటుంబాలు ఆ గ్రామంలో చాలానే ఉన్నాయి.

‘ప్రేమ్‌నగర్‌లో గుడుంబా కారణంగా కాలేయం చెడిపోయి నెలకొకరు మరణించారు. ఆరునెలల్లో ఆరు మరణ ధ్రువీకరణపత్రాలను జారీ చేశారు. గ్రామాల్లో సమావేశాలు జరిగినప్పుడు గుడుంబా మత్తులో గొడవలు సాధారణమయ్యేవి. ఎక్సైజ్‌, పోలీస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వచ్చి బట్టీలు ధ్వంసం చేసేవారు. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా అప్పటి కలెక్టర్‌ అజీమ్‌ సైతం గ్రామానికి వచ్చి అవగాహన కల్పించారు..’ అని అక్కడ గ్రామకార్యదర్శిగా పనిచేసి బదిలీ అయిన తేజస్విని తెలిపారు.

ఉద్యోగుల్లా వేషం.. బ్యాగుల్లో సరఫరా!

.

మండలంలోని కొర్లకుంట శివార్లు గుడుంబా తయారీకి అడ్డాలుగా మారాయి. ఇక్కడ పలు కుటుంబాలు అదే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక్కడి నుంచే పరిసర ప్రాంతాలకు గుడుంబా పంపుతున్నారు. ఈ ప్రాంతంలోని ఇద్దరు సోదరులు ఏళ్ల తరబడి ఇదే దందా నడిపిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఉపాధి వనరుగా మార్చుకుని మహిళలు సైతం నాటుసారా కాస్తున్నారు. ఆపై విక్రయకేంద్రాలకు చేరవేస్తున్నారు. ‘సాయంత్రం వేళ గుడుంబా సరఫరాదారులు ఉద్యోగుల్లా అవతారమెత్తుతున్నారు. విధులు ముగించుకుని వారు ఇళ్లకు తిరిగి వెళ్తున్న మాదిరిగా బ్యాగులు భుజానికి తగిలించుకొని వాటిల్లోనే గుడుంబా సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులకు సమాచారమిచ్చినా ప్రయోజనం ఉండటంలేదు..’ అని స్థానికుడు బొబ్బిలి వినోద్‌కుమార్‌ వాపోయారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.