ఏప్రిల్ నెలలో భూగర్భజల సగటు నీటి మట్టం 9.02 మీటర్లుగా నమోదైందని రాష్ట్ర భూగర్భజల శాఖ పేర్కొంది. రాష్ట్రంలో గతేడాదికంటే ఈసారి సాధారణం కన్నా.. 46 శాతం అధిక వర్షపాతం నమోదవడమే కారణంగా తెలిపింది. గతేడాది ఏప్రిల్- 2020 తో పోలిస్తే.. 2.26 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగినట్లు నివేదికలో పేర్కొంది.
ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలు మినహా.. 28 జిల్లాల్లో పెరుగుదల నమోదైనట్లు భూగర్భజలశాఖ తెలిపింది. కనిష్ఠ నీటిమట్టం 3.74 మీటర్లు వనపర్తి జిల్లాలో, గరిష్ఠ నీటిమట్టం 16.07 మీటర్లు మెదక్ జిల్లాల్లో ఉన్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: ఐదు మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటిన తెరాస