ETV Bharat / state

29 జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలమట్టం

రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగింది. 2019 డిసెంబరుతో పోలిస్తే 2020 చివరినెలలో సగటున 2.46 మీటర్ల మేర పెరిగింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, తుఫాన్లు రావడం, నదులు, వాగులు, చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో జలమట్టం పెరుగుదల నమోదైంది.

ground water, sangareddy
భూగర్భ జలమట్టం, సంగారెడ్డి,
author img

By

Published : Jan 3, 2021, 7:23 AM IST

Updated : Jan 3, 2021, 7:38 AM IST

రాష్ట్రంలోని 29జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం పెరిగిందని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ సంచాలకులు పండిట్ మద్నూరే నివేదిక విడుదల చేశారు. 12నెలల కిందటితో పోలిస్తే భూగర్భ జలమట్టం 2020 డిసెంబరులో సగటున 2.46మీటర్ల మేర పెరిగిందని పేర్కొన్నారు. 2019 డిసెంబరు నెలలో రాష్ట్ర సగటు మట్టం 8.12 మీటర్లు ఉండగా, 2020 డిసెంబరు నెల సగటు మట్టం 5.66 మీటర్లుగా నమోదయింది.

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, తుపాన్లు రావడం, నదులు, వాగులు, చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో జలమట్టంతో పెరుగుదల నమోదైంది. 2020 నవంబరు నెలతో, డిసెంబరు మట్టాలను పోల్చగా రాష్ట్రంలో 43 చదరపు కిలోమీటర్ల భూభాగంలో మాత్రమే 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీళ్లున్నట్లు గుర్తించారు. 15-20 మీటర్ల లోతులో జలం ఉన్న జిల్లాల్లో నిజామాబాద్‌ పశ్చిమప్రాంతం, సంగారెడ్డి పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు, మెదక్‌ దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు, సిద్దిపేట పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం దక్షిణ, తూర్పు ప్రాంతాలు, జోగులాంబ గద్వాల జిల్లా తూర్పు, పశ్చిమ ప్రాంతాలు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఉత్తర, పశ్చిమ ప్రాంతాలున్నాయి’ అని ఆయన వెల్లడించారు.

గత పదేళ్లతో పోలిస్తే డిసెంబరు​లో రాష్ట్రంలోని 541 మండలాల్లో భూగర్భజలాలు పెరగగా... మిగతా 48 మండలాల్లో తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సగటు 5 మీటర్లలోపే ఉండగా... మరో 16 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల వరకు ఉంది. ఒక్క జిల్లాలో మాత్రమే పది మీటర్లకు పైగా సగటు ఉంది.

ఇదీ చదవండి: ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులకు సిద్ధమవుతోన్న సర్కారు

Last Updated : Jan 3, 2021, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.