ETV Bharat / state

గోదావరి నదిలో ఇసుక తవ్వకాలపై హరిత ట్రైబ్యునల్​ ఆదేశం - తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ

రాష్ట్రంలోని గోదావరి నదిలో ఇసుక తవ్వకాలతో కలిగే ప్రభావాలపై సమగ్ర వివరాలను సంయుక్త నిపుణుల కమిటీకి అందజేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలకు సూచించింది.

Green Tribunal order on sand excavation in Godavari river in telangana
గోదావరి నదిలో ఇసుక తవ్వకాలపై హరిత ట్రైబ్యునల్​ ఆదేశం
author img

By

Published : Aug 25, 2020, 3:32 AM IST

గోదావరి నదిలో ఇసుక తవ్వకాలతో కలిగే ప్రభావాలపై సమగ్ర వివరాలను సంయుక్త నిపుణుల కమిటీకి అందజేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలకు తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా గోదావరిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని రేలా స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్​ను ఎన్జీటీ విచారించింది. ఆ అంశంపై అధ్యయానికి నిపుణులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిధిలో ఇసుక తవ్వకాలపై పర్యావరణ ప్రభావ మదింపు పేరుతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మూడు నివేదికలు సమర్పించింది. మొదటి నివేదికను పరిశీలించి ఎన్జీటీకి సంయుక్త కమిటీ వివరాలు ఇచ్చింది. రెండో నివేదికపై కరోనా నేపథ్యంలో నిపుణుల కమిటీకి సమగ్ర సమాచారం ఇచ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయని.. కొంత సమయం కావాలని సీపీసీబీ, ఎస్​పీసీబీ, టీఎస్ఎండీసీ కోరాయి. సమాచారం అందజేత, విశ్లేషణకు మూడు నెలల గడువు ఇచ్చిన ఎన్జీటీ తదుపరి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి : అగ్ని ప్రమాదంపై తక్షణమే నివేదిక పంపండి: కృష్ణా బోర్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.