Green India Challenge: చెట్లు మనుషుల ఆత్మకు శాంతినిస్తాయని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బంజారాహిల్స్ పంచవటి కాలనీలో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లీష్ సాహిత్యంలో చెట్లు వాటి వేర్లు మానవ ఎదుగుదలను.. మనిషి తన మూలాలను మరిచిపోవద్దనే మూల సూత్రాన్ని వివరిస్తాయని ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు.
అందుకే మనిషి తన ఎదుగుదలను మొక్కలతో పోల్చుకోవాలని ఆండ్రూ ఫ్లెమింగ్ సూచించారు. తాను గత 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన పచ్చదనంతో కనువిందు చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, కాలాలకు అతీతంగా.. నిత్యం మొక్కలు నాటించే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమని తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాకుడదని.. మానవ నాగరికత నడుస్తున్న ప్రతీ చోట ఇది అవసరమేనని ఆండ్రూ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని దిగ్వజయంగా కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రూ ఫ్లెమింగ్‌కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి గురించి వారి చెప్పిన మాటలు చాలా విలువైనవని.. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.
ఇవీ చదవండి: Niranjan Reddy : 'వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా..?'
తాచు పాముకు యాక్సిడెంట్.. హుటాహుటిన ఆస్పత్రికి.. తలకు సర్జరీ!