ETV Bharat / state

అమెరికాలో పెళ్లి.. అనపర్తిలో దీవెనలు - ఆన్​లైన్​లో మనుమరాలి పెళ్లి చూసిన తాతా నాన్నమ్మ న్యూస్

పెళ్లంటే.. పందిళ్లు, బంధువులు.. ఆ అల్లరే వేరు. కరోనా పుణ్యమా అని అంతా తలకిందులైంది. ఓ తాత నాన్నమ్మ.. తాము అల్లారుముద్దుగా పెంచుకున్న మనుమరాలి పెళ్లిపైనా కరోనా ప్రభావం చూపింది. ఆ తాతా నాన్నమ్మలు.. ఎలాగైనా అమెరికాలో ఉన్న తమ మనుమరాలి పెళ్లిని అనపర్తి నుంచే చూడాలనుకున్నారు. అందుకోసం ఓ ఏర్పాటు చేసుకున్నారు.

అమెరికాలో పెళ్లి.. అనపర్తిలో దీవెనలు
అమెరికాలో పెళ్లి.. అనపర్తిలో దీవెనలు
author img

By

Published : Dec 9, 2020, 11:00 PM IST

అమెరికాలో పెళ్లి.. అనపర్తిలో దీవెనలు

కరోనా ప్రభావంతో మనువరాలి పెళ్లిని చూడలేకపోయ్యారా ఆ తాత నాన్నమ్మలు. చివరికి బంధువులతో కలిసి అంతర్జాలంలో వీక్షించి ఆశీర్వదించారు. ఏపీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వ్యాపారవేత్త చింతా శ్రీనివాస రెడ్డి కుమార్తె ధనలక్ష్మి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్న రామ్ రెడ్డితో వివాహం నిశ్చయించారు. మార్చిలో నిశ్చితార్థం కూడా జరిపారు.

అనంతరం వధూవరులు వారి ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లారు. అయితే లాక్​డౌన్ రావడం, ఉద్యోగ రీత్యా స్వదేశానికి రావడం కుదరకపోవడం వల్ల అమెరికాలోనే పెళ్లి చేయాలని అనుకున్నారు. వధూవరుల తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిపించారు. వారి వివాహాన్ని తాత నానమ్మలు వీక్షించేందుకు అంతర్జాలంలో లైవ్ ఇవ్వగా వారు బంధువులతో కలిసి వధువు ఇంటివద్దే దీవించారు. స్క్రీన్​పై అక్షింతలు వేసి వధూవరులను ఆశ్వీరదించారు.

ఇదీ చూడండి: కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది: మాణిక్కం ఠాగూర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.