Grand IIT graduation ceremony: ఐఐటీ హైదరాబాద్ 11 స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఆజాదీ కా అమృత్ థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సింగపూర్ నాన్ యాంగ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు సుబ్ర సురేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఛైర్మన్ బీవీ మోహన్ రెడ్డి, సుబ్ర సురేష్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. 873మంది విద్యార్థులకు 884డిగ్రీలు అందజేశారు.
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు బంగారు, 32మందికి వెండి పథకాలు ప్రదానం చేశారు. ఐఐటీ మద్రాస్‌లో చదువుకోవడం వల్ల తన జీవితం అనూహ్య మలుపు తిరిగిందని.. అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు సారథ్యం వహించే అవకాశం లభించిందని సుబ్ర సురేష్ విద్యార్థులకు వివరించారు. తమ పిల్లలకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన సూచించారు.
ఐఐటీలో చదివించడంతో దానిని పూర్తి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి సుబ్ర సరేష్ పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని.. దానిని రాబోయే రోజుల్లో సాధించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదడ్రులు పాల్గొనడంతో ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణం సందడిగా మారింది.
ఇవీ చదవండి: