భాగ్యనగరం వేదికగా మరో జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. ఈ నెల 23 నుంచి ఐదు రోజులపాటు నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ (టీఈవో) ఆధ్వర్యంలో 8వ అఖిల భారత మేళా జరగనుంది. తొలి రోజు ఈ సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్ విడుదల చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్‌బంగ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి 100కు పైగా స్టాళ్లు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. దేశంలో పేరెన్నికగన్న నర్సరీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.
ప్రజల్లో రసాయన అవశేషాలు ఆహారానికి ప్రత్యామ్నాయంగా అవగాహన కల్పనకు సేంద్రియ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, ఆహారం పదార్థాలు అందుబాటులో ఉంచనున్నారు. నగర వాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు, రైతులు తరలివచ్చి ఈ జాతీయ ప్రదర్శనను విజయవంతం చేయాలని తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ ఖలీద్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'డబ్బులొద్దు... ప్రాంతం అభివృద్ధి చేస్తే చాలు'