ETV Bharat / state

House permissions in villages: ఊళ్లో.. ఇళ్లు కట్టేదెలా..?

author img

By

Published : Feb 6, 2022, 8:45 AM IST

House permissions in villages: గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్‌కు ఎల్​ఆర్​ఎస్​ లేదంటూ పంచాయతీ అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు 10.83 లక్షల దరఖాస్తులు రాగా.. వాటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

House permissions in villages
గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల నిరాకరణ

House permissions in villages: గ్రామాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు నిలిచిపోయాయి. ‘లేఅవుట్‌కు అనుమతి లేదు.. ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ లేదు’ అంటూ గృహ నిర్మాణాలకు పంచాయతీలు అనుమతి ఇవ్వడంలేదు. గ్రామాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటివరకు 90 వేల గృహ నిర్మాణ దరఖాస్తులు వస్తే వీటిలో 48 వేలను మాత్రమే ప్రాథమికంగా ఆమోదించారు. మిగతా వాటిని వివిధ దశల్లో నిలిపివేశారు. మున్సిపాలిటీల్లో ఇలాంటి భూముల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా అపరాధ రుసుముతో అనుమతి ఇస్తున్న సర్కారు.. గ్రామాల్లో ఇవ్వకపోవడంతో సొంతిల్లు నిర్మించుకోవాలని భావిస్తున్న గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు.

6,291 గ్రామాల నుంచి దరఖాస్తులు

LRS applications: గ్రామాల్లో అనుమతిలేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు.. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం అమల్లోకి వచ్చాక తమ స్థలాల క్రమబద్ధీకరణకు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 6,291 గ్రామాల నుంచి దాదాపు 10.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా ప్లాట్లలో సొంత ఇళ్లు నిర్మించుకోవాలనుకున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, జనగామ జిల్లాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. అనుమతి లేని లేఅవుట్‌లోని ప్లాటులో ఇంటిని కడితే వెంటనే పంచాయతీ కార్యదర్శులు కూల్చివేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తమ ఉద్యోగం పోతుందని కఠినంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నగరాలు, మున్సిపాలిటీల్లో అమలవుతున్న విధానాన్ని పల్లెలకూ వర్తింపజేయాలని వారంతా గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

LRS permissions: ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఇంటి స్థలం క్రమబద్ధీకరణ కాకున్నా, నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు పురపాలకశాఖ 2020 డిసెంబరు 30న మెమో జారీ చేసింది. నిర్ణయించిన ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై 33 శాతం కాంపౌండింగ్‌ ఫీజు చెల్లించి (2020 ఆగస్టు 26కు ముందు లేఅవుట్‌లలో రిజిస్టరు అయిన స్థలాల్లో) ఇంటి నిర్మాణ అనుమతి పొందవచ్చని తెలిపింది. ఈ ఆదేశాలు పట్టణాలు, నగరాలకే పరిమితం కావడంతో పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాల్లో అనుమతులు రావడం లేదు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.