ETV Bharat / state

సీడ్​యాక్సెస్​ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం - సీడ్ యాక్సెస్​ రోడ్డుపై ప్రభుత్వ నిర్ణయం వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తిగా నిలిపివేసిన రాష్ట్రప్రభుత్వం....తక్షణ ప్రాధాన్యతాంశంగా చేపట్టాల్సి ఉన్న సీడ్‌ యాక్సిస్ రోడ్డుకు సైతం మంగళం పాడనుంది. 4 కిలోమీటర్ల నిర్మిస్తే...అద్భుతమైన రహదారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా...కృష్ణా కరకట్ట రోడ్డును 4 వరుసల రహదారిగా నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఏపీ సీఎంతో జరిగిన సమీక్షలోనూ ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం..

govt-changes-decison-on-amaravati-seed-access-road
సీడ్​యాక్సెస్​ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం
author img

By

Published : Feb 25, 2021, 6:42 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు)ను తక్షణ ప్రాధాన్యతాంశంగా చేపట్టి పూర్తి చేయాల్సి ఉండగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలుత కృష్ణా కరకట్ట రోడ్డుపై దృష్టి పెడుతోంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును తర్వాత చేస్తాం.. మొదట కరకట్ట రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తామన్నట్లు చెబుతోంది. ఇటీవల ఏపీ సీఎంతో జరిగిన సమీక్ష సమావేశంలో కరకట్ట రోడ్డు అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ మర్నాడే పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆ రహదారిని పరిశీలించి వచ్చారు.

కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ఆ బాధ్యతను జలవనరులశాఖకు అప్పగించింది. నిధుల్ని అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) సమకూర్చనుంది. కృష్ణా కరకట్టకు సమాంతరంగా 8 వరుసలుగా, అత్యాధునిక ప్రమాణాలతో చేపట్టిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మూడొంతులకు పైగా నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉంది. దాన్ని పక్కనపెట్టి.. రాజధానికి పూర్తిగా ఒక చివరన, కృష్ణా నది ఒడ్డున వెళ్లే ప్రమాదభరితమైన కరకట్ట రోడ్డును ప్రధాన రహదారిగా అభివృద్ధి చేస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని రాజధాని ప్రజలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరో మార్గం లేనప్పుడు కరకట్ట రోడ్డు ప్రత్యామ్నాయం.. అంతే తప్ప రాజమార్గం లాంటి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఉండగా, కరకట్ట రోడ్డును విస్తరించి దానిపైనే ట్రాఫిక్‌ పెంచుతామనడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

మొదట పూర్తి చేయాల్సింది సీడ్‌ యాక్సెస్‌ రోడ్డే
ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టిన మొదటి ప్రాజెక్టు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డే. అటు చెన్నై వైపు నుంచి, ఇటు విశాఖ వైపు నుంచి వచ్చే వాహనాలు.. రాజధానిలోకి సులభంగా ప్రవేశించేందుకు వీలుగా ఆ రహదారి ప్రణాళిక రూపొందించారు. దీన్ని జాతీయ రహదారిపై కనకదుర్గ వారధి దాటిన తర్వాత.. మణిపాల్‌ ఆస్పత్రి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 3.08 కి.మీ.లు ఒక ప్యాకేజీగా, ప్రకాశం బ్యారేజీ నుంచి దొండపాడు వరకు 18.270 కి.మీ.ల దూరం రెండో ప్యాకేజీగా చేపట్టాలని నిర్ణయించారు.

మొదట ప్రకాశం బ్యారేజీ- దొండపాడు ప్యాకేజీ పనులు ప్రారంభించి 14 కి.మీ.ల నిర్మాణం పూర్తి చేశారు. భూసమీకరణ సమస్యలతో బ్యారేజీ నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు సుమారు 4 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. దాన్ని కూడా నిర్మించి, ఇప్పటికే పూర్తయిన 14 కి.మీ.ల్లో అక్కడక్కడా పెండింగ్‌లో ఉన్న కల్వర్టులు, చిన్న చిన్న అనుసంధాన పనుల్ని పూర్తి చేస్తే... రాజమార్గం లాంటి రహదారి సిద్ధమవుతుంది. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ నుంచి మణిపాల్‌ ఆస్పత్రి వరకు మిగతా 3.08 కి.మీ.ల రహదారిని కూడా నిర్మిస్తే.. జాతీయ రహదారికి, రాజధానితో అద్భుతమైన అనుసంధాన మార్గం ఏర్పడుతుంది. ఆ రహదారి పూర్తయితేనే అమరావతికి రాకపోకలు సాగించేందుకు సౌలభ్యంగా ఉంటుంది. అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఇప్పట్లో కరకట్ట రోడ్డు అవసరమే ఉండదు.

* ప్రకాశం బ్యారేజీ నుంచి దొండపాడు వరకు 18.270 కి.మీ.ల రహదారిని పూర్తి చేస్తే రాజధానికి తక్షణ అనుసంధానత ఏర్పడుతుంది. అక్కడితో దాన్ని ఆపేస్తే... చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలు ఆ రహదారిపై ప్రవేశించాలంటే మంగళగిరి పట్టణంలో నుంచి, పాత జీఎన్‌టీ రోడ్డు మీదుగా రావాలి. విశాఖ నుంచి వచ్చే వాహనాలు ప్రకాశం బ్యారేజీ మీదుగా ఆ రోడ్డులో ప్రవేశించాలి. జాతీయ రహదారి నుంచి తాడేపల్లి మీదుగా వచ్చేందుకు కొన్ని మార్గాలున్నా అవి చిన్నవి. ఒకపక్క కొండ, మరోపక్క కాలువ ఉండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద జీఎన్‌టీ రోడ్డును విస్తరించలేరు. ఇప్పటికే ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. కాబట్టి మొదట 14 కి.మీ.ల రహదారి పూర్తి చేసి, రెండో దశలో మణిపాల్‌ ఆస్పత్రి వరకు నిర్మిస్తేనే పూర్తిస్థాయిలో ఉపయుక్తంగా ఉంటుంది.

మూడేళ్లుగా వాడుతున్నా నిరాదరణే
మంతెన ఆశ్రమం నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు అందుబాటులోకి వచ్చాక.. దాదాపు మూడేళ్లుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సహా రాజధానికి రాకపోకలు సాగించేవారంతా దీన్నే వినియోగిస్తున్నారు. మంతెన ఆశ్రమం వరకు కరకట్ట రోడ్డుపై వచ్చి అక్కడి నుంచి సీడ్‌యాక్సెస్‌ రోడ్డు మీదుగా సచివాలయానికి చేరుకుంటున్నారు. ప్రభుత్వం మారాక రాజధానిలో పనులు నిలిపేయడంతో.. సీడ్‌యాక్సెస్‌ రోడ్డులో కనీసం విద్యుత్‌ దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. రాత్రయితే చిమ్మ చీకటి. కనీస నిర్వహణ కూడా లేకపోవడంతో ఇప్పటికే సిద్ధమైన 14 కి.మీ.ల రహదారి కూడా పాడవుతోంది. రోడ్డుకిరువైపులా, డివైడర్‌ ప్రాంతంలోనూ పిచ్చి మొక్కలు మొలిచాయి. పలువురు అక్కడే పశువుల్ని కట్టేసి మేపుతుండటం గమనార్హం.

కరకట్ట రోడ్డుతో ఉపయోగం అంతంతే
గతంలో తుళ్లూరు మండలంలో కృష్ణా నదికి సమీపంలోని వెంకటపాలెం, మందడం, ఉద్ధండరాయునిపాలెం, రాయపూడి తదితర గ్రామాల ప్రజలు... ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించడానికి, విజయవాడకు రాకపోకలు సాగించడానికి కరకట్ట రోడ్డును వాడేవారు. మిగతా గ్రామాల ప్రజలు పాత ఆర్‌అండ్‌బీ రోడ్డునే వినియోగించేవారు. అప్పట్లో కరకట్ట రోడ్డుపై ద్విచక్రవాహనాలు, ఆటోలు మాత్రం నడిచేవి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాక.. ఆర్‌అండ్‌బీ రోడ్డు తప్ప మరో అనుసంధాన రహదారి లేకపోవడంతో, కరకట్ట రోడ్డును కొంత అభివృద్ధి చేసి, మంతెన ఆశ్రమం వరకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు సింగిల్‌ రోడ్డు. ఇది రెండు మీటర్ల ఎత్తున ఉంటుంది. రోడ్డుపక్కనే పొదలు, దిగువన పొలాలు ఉన్నాయి. ఈ రోడ్డుపై వెళ్లేటప్పుడు ఆదమరిచినా, వాహనం అదుపు తప్పినా.. అంతెత్తు నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి పడటం ఖాయం. పైగా రాజధానిలోని మిగతా గ్రామాల ప్రజలకు కరకట్ట రోడ్డు చాలా దూరమవుతుంది. అదే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు చాలా గ్రామాలు సమీపంలో ఉంటాయి. ఎక్కువ మందికి అదే ఉపయుక్తం.

తేలిగ్గా పూర్తయ్యేదాన్ని వదిలేసి!
* కరకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడం కంటే.. ఇప్పటికే మూడొంతులు సిద్ధమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును, కనీసం ప్రకాశం బ్యారేజీ వరకైనా పూర్తి చేయడం తేలిక. కరకట్ట రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించాలన్నా రైతుల నుంచి కొంత భూమిని సేకరించాలి. అదే ప్రయత్నం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కోసం చేస్తే దాన్ని త్వరగా సిద్ధం చేయవచ్చు.
* కరకట్ట రోడ్డును ప్రకాశం బ్యారేజీ నుంచి మొదలు పెట్టి 9.5 కిలోమీటర్ల దూరం వరకు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో, రిటెయినింగ్‌ వాల్స్‌తో, నాలుగు వరుసలుగా నిర్మించేందుకు గతంలో సీఆర్‌డీఏ టెండర్లు ఖరారు చేసింది. నదీ అభిముఖ (రివర్‌ఫ్రంట్‌) ప్రాంత అభివృద్ధిలో భాగంగా దాన్ని సుందరంగా, ఆధునికంగా నిర్మించాలన్నది ప్రతిపాదన. అప్పట్లో దీన్ని చివరి ప్రాధాన్యంగా పెట్టుకుంది.
* ఏఎంఆర్‌డీఏ ఇప్పుడు కరకట్ట రోడ్డుకు మొదటి ప్రాధాన్యమిస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 15.7 కి.మీ.ల పొడవు వరకు రూ.150 కోట్లతో నాలుగు వరుసలుగా రిటెయినింగ్‌ వాల్స్‌ లేకుండానే అభివృద్ధి చేస్తామంటోంది. రిటెయినింగ్‌ వాల్స్‌ లేకుండా.. కరకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించి, ప్రధాన రహదారిగా మారిస్తే ప్రయాణం ప్రమాదభరితంగా మారుతుంది.

ఇదీ పరిస్థితి..
* రాజధాని అమరావతిని రాష్ట్రానికి అనుసంధానించేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన సీడ్‌ యాక్సెస్‌ రహదారి ఇది.
* అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ రహదారి అభివృద్ధిని కొనసాగించకపోవడంతో నిరాదరణకు గురై ఇలా పశువులకు ఆవాసంగా మారుతోంది.
* సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఇప్పటికే పూర్తయిన 14 కి.మీ.ల భాగాన్ని 8 వరుసలుగా అభివృద్ధి చేశారు. రూ.248 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు.
* కరకట్ట రోడ్డు సుమారు రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలంటే.. మిగతా భాగాన్ని ఇప్పుడున్న ఎత్తుకు పెంచాలి. అది భారీ ఖర్చుతో కూడుకున్న పని.

ఇదీ చదవండి:ప్రత్యక్ష తరగతులకు తొలిరోజు 9 శాతం హాజరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.