గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రంలోని శ్రామికులకు ఆరోగ్యం, భద్రతా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఏటా ఏప్రిల్ 28న పనిచేసే ప్రాంతాల్లో ఆరోగ్యం, భద్రతాదినాన్ని పాటిస్తారు. కొవిడ్ 19పై పోరటానికి కలిసి రావాలని తమిళిసై పిలుపునిచ్చారు. ఆరోగ్యం, రక్షణ చర్యలతోపాటు పనిచేసే చోట ప్రశాంత, సురక్షిత, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా శ్రామికులు, కార్మికుల్లో అవగాహన కల్పించాలన్నారు. సానుకూల ధృక్పథం, చిన్నపాటి నివారణ మార్గాల ద్వారా కరోనాను సులువుగా జయించొచ్చని చెప్పారు.
'కరోనాపై పోరులో శ్రామికులు భాగస్వామ్యం కావాలి' - తమిళిసై సౌందరరాజన్ వార్తలు
రాష్ట్రంలోని శ్రామికశక్తికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోగ్యం, భద్రతా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా ఏప్రిల్ 28న పనిచేసే ప్రాంతాల్లో ఆరోగ్యం, భద్రతాదినాన్ని పాటిస్తారు.