ETV Bharat / state

Governor: కొవిడ్​పై దేశం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం: తమిళిసై

కొవిడ్​కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అమెరికాలోని లీడ్ ఇండియా-డీబీఏ లీడ్ ఫౌండేషన్ గ్లోబల్ నిర్వహించిన "కొవిడ్ -19 సెకండ్ వేవ్" గ్లోబల్ వర్చువల్ సదస్సులో గవర్నర్ ప్రసంగించారు.

Tenanga news
గవర్నర్
author img

By

Published : Jun 3, 2021, 7:30 AM IST

కొవిడ్​ రెండో దశలో ప్రమాదంలో ఉన్న లక్షలాది మంది ప్రాణాలను కాపాడేందుకు... దేశం ఎన్నో అడ్డంకులను సమర్థవంతంగా అధిగమిస్తోందని గవర్నర్​ తమిళిసై అన్నారు. అమెరికాలోని లీడ్ ఇండియా-డీబీఏ లీడ్ ఫౌండేషన్ గ్లోబల్ నిర్వహించిన "కొవిడ్ -19 సెకండ్ వేవ్" గ్లోబల్ వర్చువల్ సదస్సులో గవర్నర్ ప్రసంగించారు. సాధారణంగా అయితే రోజుకు 900 మెట్రిక్ టన్నుల మెడికల్​ ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతుందని.. కానీ కొవిడ్​ తీవ్రత వల్ల రికార్డు స్థాయిలో రోజుకు 9,500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను దేశంలో ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.

భారత వైమానిక దళం, నావికాదళం, రైల్వేలు, ఇతర రహదారి రవాణా సంస్థలను దేశంలోని ప్రతి ప్రాంతానికి మెడికల్​ ఆక్సిజన్ సరఫరా చేయడానికి సేవల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. టీకా పరంగా స్థిరమైన పురోగతి సాధిస్తున్నామని.. రోజూ 20 లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదులను ఇస్తున్నామని వివరించారు. అతి త్వరలో రోజులో కోటి వ్యాక్సిన్ మోతాదులను ఇవ్వబోతున్నామని వెల్లడించారు. కొవిడ్​ పరీక్షలను రోజుకు 20 లక్షలకు పైగా పరీక్షిస్తోందని.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల నమూనాలను పరీక్షించిందని గుర్తుచేశారు.

ఇదీ చూడండి: టీకాలు అందకుంటే కొవిడ్‌ మూడో దశా తీవ్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.