ETV Bharat / state

Governor Tamilisai on Vaccination: టీకా ఒక్క డోసు తీసుకోవడంతో ఉపయోగంలేదు : గవర్నర్​ తమిళిసై - governor tamilisai wishes

Governor Tamilisai Visit Chintal Basti PHC: హైదరాబాద్​ చింతల్​ బస్తీ అర్బన్ పీహెచ్‌సీని గవర్నర్ తమిళిసై సందర్శించారు. తొలి డోసు వందశాతం పూర్తయిన సందర్భంగా పీహెచ్‌సీకి వెళ్లిన గవర్నర్​... అక్కడి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. సరైన సమయానికే రెండో డోసు తీసుకోవాలని సూచించారు.

governor tamilisai
గవర్నర్​ తమిళిసై
author img

By

Published : Dec 29, 2021, 11:54 AM IST

Updated : Dec 29, 2021, 12:02 PM IST

గవర్నర్​ తమిళిసైతో ముఖాముఖి

Governor Tamilisai Visit Chintal Basti PHC: రాష్ట్రంలో మొదటి డోసు వందశాతం పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్​ తమిళిసై పేర్కొన్నారు. హైదరాబాద్​ చింతల్​ బస్తీ అర్బన్ పీహెచ్‌సీని తమిళిసై సందర్శించారు. తొలి డోసు వందశాతం పూర్తయిన సందర్భంగా పీహెచ్‌సీకి వెళ్లిన గవర్నర్​... పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.

'రాష్ట్రంలో మొదటి డోస్​ 100శాతం పూర్తి కావడం సంతోషంగా ఉంది. సరైన సమయానికి రెండో డోస్​ తీసుకోవాలి. కేవలం ఒక డోస్​ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నా అభినందనలు. 2022 ఆరోగ్య సంవత్సరంగా సాగాలని కోరుకుంటున్నా...'

- తమిళిసై, తెలంగాణ గవర్నర్

Governor Tamilisai on Corona Vaccination: సరైన సమయానికే రెండో డోసు తీసుకోవాలని గవర్నర్​ సూచించారు. కేవలం ఒక డోసు తీసుకోవడం వల్ల ఉపయోగం లేదని వెల్లడించారు. ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి టీకాలు అందిస్తున్నారని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా మాస్కు కచ్చితంగా ధరించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంతోపాటు మరో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కూడా మొదటి డోస్ 100శాతం పూర్తైన సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.

  • Glad to see my dream of 100% comes true in TS & Recall my visit Jan 2nd 2021 in my twitter "Gov visited Covid-19 vaccination dry run centre at Primary Health Centre, Tilaknagar. went round the centre & had interaction with the health staff and the beneficiaries who got vaccine pic.twitter.com/fi99OElasZ

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'తొలిడోసు వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ'

Last Updated : Dec 29, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.