జాతీయ నూతన విద్యావిధానం-2020... విద్యలో నాణ్యతను పెంచి.. గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా భారత్‌ను నిలుపుతుందని గవర్నర్ తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ నిర్వహించిన వెబినార్‌లో గవర్నర్ పాల్గొన్నారు.
ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీ... విద్యార్థులను జాబ్ సీకర్స్లా కాకుండా.. జాబ్ క్రియేటర్లుగా ఎదిగేలా చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో ఇవ్వటం వల్ల.. విషయం పట్ల విద్యార్థుల్లో మెరుగైన అవగాహన వస్తుందని గవర్నర్ అన్నారు. జపాన్, జర్మనీ, కొరియా వంటి దేశాల్లోని పౌరులకు.. మాతృభాషలో బోధనే వారిని టెక్నాలజీ లీడర్స్‌లా ఎదిగేలా చేసిందని గుర్తు చేశారు.
-
Hon’ble Governor Webinar on National Education Policy 2020 at Rajbhavan on 09-10-2020.#nationaleducationpolicy2020 #NewEducationPolicy2020#TelanganaGovernor #DrTamilisaiSoundararajan #Rajbhavan #Hyderabad #Telangana pic.twitter.com/lKoZYQsD2L
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hon’ble Governor Webinar on National Education Policy 2020 at Rajbhavan on 09-10-2020.#nationaleducationpolicy2020 #NewEducationPolicy2020#TelanganaGovernor #DrTamilisaiSoundararajan #Rajbhavan #Hyderabad #Telangana pic.twitter.com/lKoZYQsD2L
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 9, 2020Hon’ble Governor Webinar on National Education Policy 2020 at Rajbhavan on 09-10-2020.#nationaleducationpolicy2020 #NewEducationPolicy2020#TelanganaGovernor #DrTamilisaiSoundararajan #Rajbhavan #Hyderabad #Telangana pic.twitter.com/lKoZYQsD2L
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 9, 2020
భారతీయ విద్యాసంస్థల్లో ప్రపంచ స్థాయి విద్య దొరికేలా చూడాలని.. కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన విద్యావిధానంపై విస్తృత అవగాహనకు పాటుపడుతూ, సందేహాల నివృత్తికి అకడమిక్ నిపుణులు పాటుపడాలని సూచించారు. దేశంలోని ప్రతిజిల్లాలో భిన్న కోర్సులను ఆఫర్ చేసే పరిశోధనాత్మక విశ్వవిద్యాలయం తీసుకురావాలనేదే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని తమిళిసై పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఏపీ పాలిసెట్-2020 ఫలితాలు విడుదల