ఆదివాసులు తయారుచేసిన వస్తువులకు హైదరాబాద్‌లో ఓ మ్యూజియం ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) తెలిపారు. అన్నిశాఖలతో కలిసి గిరిజన ప్రజల జీవన విధానంపై సర్వే చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ఆధ్యకళ పేరుతో... ఆదివాసీ, గిరిజన వస్తువుల ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనను తమిళిసై సౌందర్‌రాజన్ సందర్శించారు.
ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవాలు కూడా ఇప్పుడున్న కాలానికి అనుకూలంగా మారుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. చాలా అరుదైన వస్తువులు ఈ ప్రదర్శనలో ఉన్నాయని తెలిపారు. గిరిజన తెగలకు చెందిన డోలు, తుడుం, కిన్నెర, సన్నాయి, కాలీ కోం వంటి ప్రాచీన వాయిద్యాలతోపాటు.... కొన్ని అరుదైన వస్తువులు ఆకట్టుకున్నాయని గవర్నర్ వివరించారు.
ఆధ్యకళ ప్రదర్శనలో కొత్త కొత్త వస్తువులు తిలకించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శనలో చాలా అరుదైన వస్తువులు ఉన్నాయి. ప్రాచీన వస్తు సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. కాలానికనుగుణంగా ఆదివాసీల జీవన విధానంలో మార్పులు రావాలి. పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటివి వారికి అందుబాటులోకి రావాలి. అందుకోసం మేం కొన్ని సర్వేలు నిర్వహించాం. అందుకే నేను రెండో డోసు వ్యాక్సిన్‌ను గిరిజనులతో కలిసి తీసుకున్నాను. ఆదివాసీల వస్తువుల కోసం మంచి మ్యూజియం ఏర్పాటు చేస్తాం. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-తమిళిసై సౌందర్‌రాజన్, గవర్నర్
మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సంగీత వాయిద్యాల జాతరను నిర్వహించారు. ఆధ్యకళ పేరుతో జానపద-ఆదివాసీ వాయిద్యాలతో పాటు వివిధ వస్తువులను ప్రదర్శించారు. ప్రాచీన వస్తువులైన డోలు, తుడుం, కిన్నెర, సన్నాయి, కాలికోమ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చదవండి: భారతావనిని ఏకతాటిపైకి తెచ్చిన మహోగ్ర ఉద్యమం