ETV Bharat / state

governor: 'సమష్టి కృషితో మానవ అక్రమ రవాణా అరికట్టాలి'

మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. యూఎస్ కాన్సులేట్ సహకారంతో ప్రజ్వల ఫౌండేషన్ ప్రచురించిన కౌంటరింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ పుస్తకాలను గవర్నర్ ఆవిష్కరించారు.

Governor
Governor
author img

By

Published : Jul 30, 2021, 7:23 PM IST

డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని గవర్నర్​ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్ కాన్సులేట్ సహకారంతో ప్రజ్వల ఫౌండేషన్ ప్రచురించిన కౌంటరింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ పుస్తకాలను గవర్నర్ ఆవిష్కరించారు. మానవ అక్రమ రవాణా ద్వారా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. దీనివల్ల అమాయకులు జీవితాలు బలవుతున్నాయని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాలో 46 శాతం మంది మహిళలు, 19 శాతం మంది అమ్మాయిలు బాధితులు అవుతున్నారని గవర్నర్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఏ సమయంలోనైనా కనీసం రెండున్నర మిలియన్ల మంది మానవ అక్రమ రవాణాలో బాధితులు జీవితాలు గడుపుతున్నారని తమిళిసై వివరించారు. మానవ అక్రమ రవాణా నుంచి కాపాడిన బాధితులను వివక్షకు గురి చేయకుండా వారి పునరావాసం కోసం కృషి చేయాలని గవర్నర్ సూచించారు. బాధితుల సమస్యలు, అనుభవాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా మానవ అక్రమ రవాణా ఎలా అరికట్టాలో సరైన ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరముందని వివరించారు.

మానవ అక్రమ రవాణా అరికట్టడంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ ప్రజ్వల సంస్థ ద్వారా చేస్తున్న కృషిని గవర్నర్ తమిళిసై అభినందించారు. ముద్రించిన పుస్తకాలను డ్యూటీ అధికారులకు అందించిన గవర్నర్... వాటిని ఉపయోగించుకొని అధికారులు, సివిల్ సొసైటీ సభ్యులు మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు కృషి చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: మహమ్మారి మాటున రాక్షస దందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.