Governor Tamilisai Comments on Political Leaders: దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నేతల వల్ల ఉన్నత పదవుల్లో ఉన్న తనలాంటి వ్యక్తులకు గుర్తింపు ఉండటం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టి వివాదం సృష్టిస్తున్నారని గవర్నర్ వాపోయారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో గవర్నర్ల సమావేశానికి 10 మంది గవర్నర్లు హాజరు కాగా.. అక్కడున్న ఓ ఐఏఎస్ అధికారి తనను గుర్తించకపోవడం బాధ కలిగించిందన్నారు.
ఇదంతా అధికారులపై రాజకీయ నేతల ప్రభావమేనన్న గవర్నర్.. తానూ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినదాన్నేనని తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సౌత్ ఫస్ట్ వెబ్ పోర్టల్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్.. దేశంలో సమాఖ్య స్ఫూర్తి అంశంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు కేంద్రంతో కలిసికట్టుగా పని చేసి దేశాభివృద్ధికి పాటుపడాలని గవర్నర్ తమిళిసై కోరారు.
దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నేతల వల్ల ఉన్నత పదవుల్లో ఉన్న నా లాంటి వ్యక్తులకు గుర్తింపు ఉండటం లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో గవర్నర్ల సమావేశానికి 10 మంది గవర్నర్లు హాజరు కాగా.. అక్కడున్న ఓ ఐఏఎస్ అధికారి నన్ను గుర్తించకపోవడం బాధ కలిగించింది. ఇదంతా అధికారులపై రాజకీయ నేతల ప్రభావమే. - తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్
ఇవీ చూడండి..
వారి త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలి: గవర్నర్ తమిళిసై
రికవరీ ఏజెంట్ల దుశ్చర్య.. లోన్ కట్టలేదని గర్భిణీపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్య!