ETV Bharat / state

ఆలస్యంగా మేల్కొని.. గడువు ముగిశాక ఇవ్వమని అడుగుతారు: తమిళి సై

author img

By

Published : Mar 5, 2023, 12:46 PM IST

Governor Tamilisai Tweet Today: తెలంగాణలోని వైద్య కళాశాలలపై తమిళిసై విభిన్నంగా స్పందించారు. వైద్య కళాశాలల దరఖాస్తుకు కేంద్రం రాష్ట్రానికి పిలుపునిచ్చిందని తెలిపారు. కానీ సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో తెలంగాణ విఫలమైందని వెల్లడించారు. ప్రభుత్వం నిద్రపోయి ఆలస్యంగా మేల్కొని.. ఆ తర్వాత ఇవ్వమని అడుగుతారంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Tamilisai Soundara Rajan
Tamilisai Soundara Rajan

Governor Tamilisai Tweet Today: తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారంటూ ఓ నెటిజన్.. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. దీనిపై ఆమె విభిన్నమైన సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన.. (పీఎంఎస్‌ఎస్‌వై) కింద కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఆ సమయంలో సకాలంలో దరఖాస్తు చేసుకోవటంలో తెలంగాణ విఫలమైందని చెప్పారు. ఇదే క్రమంలో ఒకే ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు తమిళనాడుకు వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొని.. ఆ తర్వాత ఇవ్వమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ రావటం వెనుకా ప్రధాని మోదీ విజన్ ఉందంటూ ట్వీట్​లో పేర్కొన్నారు.

  • When every state applied for new med colleges under PMSSY scheme Telangana failed to apply in time as stated by Union Health minister @MansukhMandavia You sleep and wake up late and ask. TN got 11 medical colleges in a single Year

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్విటర్ యూనివర్శిటీ ఛాన్సలర్‌: గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేసిన ట్వీట్​పై రెడ్కో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. గవర్నర్​ ట్వీట్లను రీ పోస్ట్ చేసిన సతీశ్‌రెడ్డి.. గవర్నర్‌ను ట్విటర్ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా సంబోధించారు. వైద్య కళాశాల కేటాయింపుపై గవర్నర్‌ వ్యాఖ్యలు కేవలం ప్రచారం మాత్రమేనని వివరించారు. గవర్నర్ వంటి అత్యున్నత స్థానంలో కొనసాగే అర్హత తమిళిసై సౌందర రాజన్‌కు లేదంటూ ఆయన ట్వీట్ చేశారు.

  • Chancellor of WhatsApp University?

    Governor tweets are nothing but propaganda, and she has no right to hold such an esteemed position.

    “ కనకపు సింహాసనమున
    శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
    దొనరగ బట్టము కట్టిన
    వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ “#GetLostGovernor pic.twitter.com/wG4K9kNtZh

    — YSR (@ysathishreddy) March 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎస్​ తీరుపై గవర్నర్​ అసహనం..: పెండింగ్​ బిల్లుల విషయమై ఇటీవల రాష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయంలోనూ గవర్నర్​ అసహనం వ్యక్తం చేశారు. రాజ్​భవన్​.. దిల్లీ కంటే దగ్గరగా ఉందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశిస్తూ ట్వీట్​ చేశారు. సీఎస్​గా బాధ్యతలు చేపట్టాక ప్రొటోకాల్​ లేదు, అధికారికంగా రాజ్​భవన్​కు రాలేదని పేర్కొన్నారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్​ కలవలేదన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయని తమిళిసై సౌందర రాజన్​ వ్యాఖ్యానించారు.

కొత్త ఒరవడి తీసుకురావాలనుకోవడం సరికాదు: మరోవైపు గవర్నర్ తీరుపై మంత్రి సత్యవతి రాఠోడ్ శనివారం విమర్శలు చేశారు. చట్ట సభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టి.. గవర్నర్ వ్యవస్థలో తమిళిసై సౌందరరాజన్​ కొత్త ఒరవడి తీసుకురావాలనుకోవడం సరికాదని హితవు పలికారు. చట్టసభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్​లో పెట్టడమంటే.. అవి పని చేయనట్టు భావించడమేనా అని ఆమె ప్రశ్నించారు.

ఇవీ చదవండి: గవర్నర్ వ్యవస్థలో కొత్త ఒరవడి తీసుకురావాలనుకోవడం సరికాదు సత్యవతి

పెండింగ్​ బిల్లుల వివాదం.. స్పందించిన గవర్నర్​.. ఏమన్నారంటే..?

'హుజూరాబాద్​లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే.. ఈటల ఇంటికెళ్లడం ఖాయం'

'నిరంకుశత్వం దిశగా దేశం.. దర్యాప్తు ఏజెన్సీల టార్గెట్ విపక్షాలేనా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.