ETV Bharat / state

ఎన్టీఆర్​ గ్రౌండ్స్​లో 3 రోజుల పాటు జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు

author img

By

Published : Apr 1, 2022, 5:07 PM IST

National Cultural Festival: హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్‌ స్టాల్స్‌ను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ప్రారంభించారు. జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఉత్సవాలను గిరిజన, ఆదివాసులకు అంకితం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

National Cultural Festival
ఎన్టీఆర్​ గ్రౌండ్స్​లో 3 రోజుల పాటు జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు
ఎన్టీఆర్​ గ్రౌండ్స్​లో 3 రోజుల పాటు జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు

National Cultural Festival: భారతీయ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు దోహదం చేస్తాయని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్‌ స్టాల్స్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసైతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు.

జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉత్సవాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్‌ చాలా బాగున్నాయని పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయన్నారు.

ప్రజలందరూ తరలిరావాలి.. కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల సంస్కృతిని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపి ఉంచేది సంస్కృతి. తెలంగాణకు వచ్చిన సహోదరులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. -తమిళిసై సౌందరరాజన్​, రాష్ట్ర గవర్నర్​

జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను గిరిజన, ఆదివాసులకు అంకితం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటారని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

వారికి అంకితం.. జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను గిరిజన, ఆదివాసులకు అంకితం చేస్తున్నాం. ఈ ఉత్సవాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సాంస్కృతిక ప్రదర్శనలను సాయంత్రం ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఇవాళ్టి కార్యక్రమంలో నటుడు నాగార్జున పాల్గొంటారు. రేపు ఉగాది కార్యక్రమంలో నటుడు చిరంజీవి పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు జనం తరలిరావాలని కోరుకుంటున్నాం. -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

ఇదీ చదవండి: Invitation To KTR: మరో అంతర్జాతీయ సదస్సు నుంచి మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.