ETV Bharat / state

పుర ఎన్నికలపై గవర్నర్​ తమిళిసై ఆరా - గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

రాష్ట్రంలో పుర ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలుసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో గవర్నర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. కొవిడ్​ మార్గదర్శకాలు పాటిస్తున్నారా అని ఆమె ఆరా తీశారు.

governor tamilisai call to sec pardhuGovernor Tamilisai Soundararajan news
పుర ఎన్నికలపై గవర్నర్​ తమిళిసై ఆరా
author img

By

Published : Apr 23, 2021, 7:15 PM IST

మినీ పురపోరు నిర్వహణపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆరా తీశారు. కొవిడ్ ఉద్ధృతి, వివిధ రాజకీయ పార్టీలు, వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో గవర్నర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఆందోళనలు ప్రస్తావించినట్లు సమాచారం.

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర వైద్య-ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం... అన్ని రకాల జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు గవర్నర్​కు ఎస్ఈసీ వివరించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి ఎన్నికల నిర్వహణపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు గవర్నర్ తమిళిసై సూచించినట్లు తెలిసింది.

ఇదీ చూడండి : భాజపా, తెరాస ఒకటేనని నేను మొదటి నుంచీ చెబుతున్నా: రేవంత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.