ETV Bharat / state

నేనూ మిమ్మల్ని మిస్​​ అవుతున్నా: తమిళిసై - పుదుచ్చెరి గవర్నర్

హైదరాబాద్ రాజ్ భవన్​లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం పుదుచ్చెరిలో ఉన్న గవర్నర్ తమిళిసై.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా రాజ్ భవన్ ఉద్యోగినులతో సంభాషించారు. గవర్నర్​ కోరిక మేరకు.. అధికారులు ఉద్యోగినులకు మిఠాయిలు పంచారు.

governor tamilisai Conversed with Raj Bhavan employees through visual media from puducherri
నేనూ మిమ్మల్ని మిస్స్​ అవుతున్నా: తమిళిసై
author img

By

Published : Mar 8, 2021, 8:22 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్ భవన్​లోని ఉద్యోగినులతో.. గవర్నర్ తమిళిసై జరిపిన సంభాషణ ఆసక్తికరంగా కొనసాగింది. ప్రస్తుతం పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్​గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తోన్న సౌందరరాజన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడి రాజ్ భవన్ ఉద్యోగినులతో ముచ్చటించారు.

తోటమాలి, వంట మనిషి మొదలుకొని పలు విభాగాల్లో పనిచేస్తోన్న ఉద్యోగినులు.. గవర్నర్​తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైనందుకుగాను తమిళిసైకు.. వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

తాను సైతం రాజ్ భవన్​ ఉద్యోగులను మిస్ అవుతున్నట్లు తమిళిసై వివరించారు. తాను మాట్లాడిన వీడియో కాన్ఫరెన్స్​లలో ఇదే ఉత్తమమైనదని పేర్కొన్నారు. గవర్నర్​​ కోరిక మేరకు.. ఉద్యోగినులందరికీ అధికారులు మిఠాయిలు పంచారు.

ఇదీ చదవండి: విమెన్స్​ డే స్పెషల్: సినీలాకాశంలో మెరుస్తున్న తారలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.