Governor TamiliSai Clarity on Her Resignation : తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. హైకమాండ్ ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తానని తెలిపారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా ఉంటున్నట్లు తమిళిసై సౌందర రాజన్ వివరించారు.
Tamilsai Respond on Resignation : ప్రధాని మోదీ, రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నానని తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని స్పష్టం చేశారు. ఇందుకోసం దిల్లీ వెళ్లలేదని, ఎవరినీ రిక్వెస్ట్ కూడా చేయలేదని అన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు తూత్తుకుడి వెళ్లి వచ్చానని తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు.