జస్టిస్ సుభాషణ్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి గవర్నర్ నరసింహన్ దంపతులు నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జస్టిస్ సుభాషణ్ మరణం న్యాయరంగానికి తీరని లోటని ఆవేదన చెందారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి భౌతికకాయానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాళులర్పించారు. మృతిపట్ల సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి: జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూత