ETV Bharat / state

గవర్నర్​ కీలక నిర్ణయం - నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్​ - Telangana MLC Notification 2024

Governor Decision on Nominated Quota MLC in Telangana : గవర్నర్​ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్​ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రతిపానలు తీసుకోరాదని తెలిపారు. హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రిట్​ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని పేర్కొన్నారు.

Telangana MLC Notification 2024
Governor Decision on Nominated Quota MLC in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 7:06 PM IST

Governor Decision on Nominated Quota MLC in Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకూ రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు వేశారు.

నాయకులు వేసిన పిటిషన్ల విచారణ అర్హతపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి చర్య తీసుకోవద్దని తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. రిట్ పిటిషన్లు పెండింగులో ఉండటంతో పాటు పెద్దమనుషుల ఒప్పందంపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.