Government Whip Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. భద్రతా సిబ్బందిని తిరస్కరించారు. ప్రభుత్వ విప్‌గా ఉన్న రామచంద్రారెడ్డికి.. ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుల్ కలిపి నలుగురు గన్‌మెన్లు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే తనకు గన్‌మెన్లు వద్దని పంపించారు. రాయదుర్గంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ.. గన్‌మెన్లు లేకుండానే పాల్గొన్నారు.
విదేశాల్లో ఉన్నత చదువులకు రామచంద్రారెడ్డి వెళుతున్నట్లు ప్రచారం వినపించగా.. ఈ మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ఆయన్ను కలిసి చర్చలు జరిపారు. తాను ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున గన్ మెన్లు ఉండటం ఇబ్బందిగా ఉంటుందని.. సంక్రాంతి అనంతరం మళ్లీ గన్‌మెన్లు నియమించమని రామచంద్రారెడ్డి పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిసింది. కాపు వ్యూహం ప్రజా ప్రతినిధులకు.. అధికారులకు అంతుచిక్కడం లేదు. గన్మెన్లను ఎందుకు ఉపసంహరించారో ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి: