ETV Bharat / state

ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: ఆనంద్​

author img

By

Published : Nov 24, 2020, 10:09 AM IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తానని జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. వరదసాయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

jam bag trs candidate
ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: ఆనంద్​

గత ఎన్నికల్లో కేవలం ఐదు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యానని.. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తానని.. జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ఏంజె మార్కెట్​లోని పూసల బస్తీ, సుందర భవన్​లలో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.

ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆనంద్​కుమార్​ గౌడ్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరదసాయం కింద రూ.10వేలు ఇవ్వడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

ఇవీచూడండి: 'తెరాసకు ఓటేయండి... గ్రేటర్​ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.