ETV Bharat / state

ప్రగతి భవన్​ ముట్టడించిన టీచర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు - ప్రగతి భవన్​

భార్యభర్తలిద్దరూ ఒకేచోట పనిచేసేలా స్పౌస్​ కేసుల కింద వెంటనే బదిలీలు చేపట్టాలని.. డిమాండ్​ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రగతి భవన్​ ముట్టడికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి.. గోషామహల్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

Government teachers Protest At Pragathi Bhavan
ప్రగతి భవన్​ ముట్టడించిన టీచర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు
author img

By

Published : Oct 10, 2020, 2:12 PM IST

భార్యభర్తలిద్దరూ ఒకేచోట పనిచేసేలా వెంటనే బదిలీలు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. భార్యభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారిని ఒకేచోట పనిచేసేలా బదిలీ చేస్తామని కేసీఆర్​ ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

ప్రస్తుత కొవిడ్​ నేపథ్యంలో ఇతర ప్రదేశాలకు వెళ్లి పని చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని.. ప్రభుత్వ శ్రద్ధ వహించి వెంటనే బదిలీలు చేపట్టి భార్యభర్తలిద్దరూ ఒకేచోట పనిచేసేలా చూడాలని కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్​ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత వారిని గోషామహల్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.