ETV Bharat / state

ఈ-రేస్ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో చెప్పండి - అరవింద్ ​కుమార్​కు ప్రభుత్వం షోకాజ్​ నోటీసు - FORMULA E RACE ISSUE

Government Show Cause Notice to IAS Officer Aravind Kumar : ఫార్ములా ఈ-రేసింగ్​కు సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌కు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అనుమతి లేకుండా ఈ-రేసు ఒప్పందం ఎందుకు చేసుకున్నారో తెలపాలని అందులో పేర్కొంది.

formula e race issue
Government Show Cause Notice to IAS Officer Aravind Kumar
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2024, 12:23 PM IST

Updated : Jan 9, 2024, 4:07 PM IST

Government Show Cause Notice to IAS Officer Aravind Kumar : ఫార్ములా ఈ రేస్ హెచ్ఎండీఏ ఒప్పందంపై సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌(Arvind Kumar Notices)కు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హెచ్ఎండీఏ కమిషనర్‌గా నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారో వివరణ ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి మెమో ఇచ్చారు. ముందస్తు అనుమతి లేకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏబీబీ ఫార్ములా ఈతో హెచ్ఎండీఏ త్రైపాక్షిక ఒప్పందం ఎలా చేసుకున్నారో వివరాలు సమర్పించాలని మెమోలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్‌ రద్దు - కాంగ్రెస్‌ సర్కార్​పై కేటీఆర్ ఫైర్

Formula E-Racing Issue in Telangana : ఎన్నికల కోడ్ అమల్లో(Election Code) ఉండగా సవరించిన ఒప్పందం ఎందుకు చేసుకున్నారని ప్రభుత్వం ప్రశ్నించింది. హెచ్ఎండీఏ నిధుల్లోంచి సుమారు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించారో తెలపాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఏడు రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్‌ను సర్కార్‌ ఆదేశించింది. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మెమోలో సీఎస్ స్పష్టం చేశారు.

Formula E-Racing in Hyderabad : భాగ్యనగరంలో ఫిబ్రవరి 10న నిర్వహించనున్న ఫార్ములా ఈ-రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్‌ఐఏ ఇటీవలే ప్రకటించింది. నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించలేనందునే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. గత ప్రభుత్వం 2023లో అక్టోబర్ 23న రేస్‌ నిర్వహణకు ఒప్పందం(Telangana Government Agreement of Formule E-Racing) చేసుకుందని గుర్తు చేసింది. కానీ ఆ ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. కానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించిన మున్సిపల్ శాఖపై చట్టపరమైన చర్యల కోసం నోటీసులు జారీ చేసిందని ఎఫ్‌ఐఏ ప్రకటించింది.

Formula E-Racing 2024 Starting Date : ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో జరిగే ఈ-రేస్ జనవరి 13 నుంచి ప్రారంభవ్వనుంది. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సిద్దమయింది. ఇందుకోసం గతేడాది ఇండియన్ రేస్ కోసం ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ 2.75 కిలోమీటర్ల మేర స్ట్రీట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేశారు. ప్రమోటర్ సంస్థతో పాటు హెచ్‌ఎండీఏ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించింది. గతేడాది జరిగిన ఫార్మూలా రేస్ వల్ల, హైదరాబాద్ ఇమేజ్ పెరగడంతో పాటు సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని నిర్వాహకులు వెల్లడించారు.

Formula E race in Hyderabad 2024 : గుడ్​న్యూస్.. హైదరాబాద్​లో మరోసారి ఫార్ములా ఈ రేస్.. ఎప్పుడంటే..?

వాహనదారులకు అలర్ట్ - మరో 4 రోజులే ట్రాఫిక్ చలాన్ల రాయితీ ఆఫర్

Last Updated : Jan 9, 2024, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.