రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వాహనాలకు త్రైమాసిక పన్నును 25 శాతం పెంచడాన్ని తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బూడిద నందా రెడ్డి ఖండించారు. ప్రభుత్వం వెంటనే ఈ పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 7.50 లక్షల మంది డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పన్నుకు అదనంగా 25 శాతం వసూలు చేయడం దారుణమన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లారీ యజమానుల పట్ల, లారీ డ్రైవర్ల పట్ల సీఎం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి..
మోదీ హైదరాబాద్ పర్యటన.. 'మినిట్ టూ మినిట్' షెడ్యూల్ ఇదే..!
కూతుర్ని వ్యభిచార ఊబిలోకి దింపి.. తండ్రి అత్యాచారం.. రోజూ 25 మందితో కలిసి!