కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అమ్ముకునే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలని... ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. రైతులు బయటకు వస్తే లాక్‌డౌన్ కారణంగా వెనక్కి పంపిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వ్యవసాయ, ఉద్యానవన శాఖలు జోక్యం చేసుకుని గుర్తింపు కార్డులిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. రైతులు తాము పండించిన కూరగాయలను... రైతు బజార్లల్లో, కాలనీలల్లో అమ్ముకునే అవకాశం కల్పించాలని సర్కార్‌ను కోరారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురి మృతి.. ఒక్కరోజే 30 కొత్త కేసులు