ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనాధ్యాపకుల వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను వైద్యులు కలిశారు. రాజకీయం కోసమే జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్నారని ఆక్షేపించారు. జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారని... ఆయనపై ఎంసీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. జూనియర్ వైద్యులకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని... నియామకాలు జరిగేలా చూస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారికి కూడా వయోపరిమితి పెంపు వర్తింపజేయాలని కోరారు..
ఇదీ చూడండి: 'నాలాల ఆక్రమణతోనే రోడ్లపై వర్షపునీరు'