ఉద్యోగుల బీమా వయస్సు, స్లాబులను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. పదవీవిరమణ వయస్సును పెంచిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా వయోపరమితి, స్లాబుల్లో మార్పులు చేసింది. ఉద్యోగుల బీమా కోసం గరిష్ఠ వయస్సు ఇప్పటి వరకు 53 ఏళ్లు ఉండగా... దాన్ని 56 ఏళ్లకు పెంచింది. కనిష్ఠ బీమా వయస్సు 21 నుంచి 19 ఏళ్లకు తగ్గించారు.
ప్రీమియం స్లాబులను కూడా మార్చారు. కనిష్ఠ ప్రీమియం స్లాబును 500 నుంచి 750 రూపాయలకు పెంచారు. గరిష్ఠ ప్రీమియం స్లాబును 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచారు. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: CM KCR: ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు.. కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్