ETV Bharat / state

న్యాయవాదుల కోసం రూ.10 కోట్లు విడుదల - Funds released for lawres due to corona effect

న్యాయవాదులకు సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదులకు ఈ నిధులను ఉపయోగించాలని తెలిపింది.

న్యాయవాదులకు రూ. 10 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

author img

By

Published : Oct 21, 2020, 6:47 PM IST

కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదులకు సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 10 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఆర్థికంగా అవసరమున్న న్యాయవాదికి రూ. 6 వేలు న్యాయవాద క్లర్కుకు రూ. 3 వేల చొప్పున సాయం చేయాలని రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ నిర్ణయించింది.

అర్హులైన న్యాయవాదులకు ఆన్​లైన్​లో డబ్బులు జమ చేయాలని కమిటీ తీర్మానించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేయగా... ఇప్పటివరకు 14, 531 మంది న్యాయవాదులు.. 1,054 మంది అడ్వొకేట్ క్లర్కులకు ఆర్థిక సాయం చేసినట్లు ట్రస్ట్ డైరెక్టర్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. నిధులు విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.