ETV Bharat / state

వైద్య విద్యా ప్రవేశ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు - వైద్య విద్యా ప్రవేశ వార్తలు

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు వేర్వేరుగా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. కరోనా వ్యాప్తి జరుగుతున్న కారణంగా ఆన్​లైన్​లోనే కౌన్సిలింగ్ ప్రక్రియ జరుతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉన్నతాధికారులు తెలిపారు.

government-orders-to-conduct-separate-counseling-process-for-mbbs-and-bds-courses
వైద్య విద్యా ప్రవేశ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
author img

By

Published : Dec 5, 2020, 8:36 AM IST

2020-21 విద్యా సంవత్సరం వైద్య విద్యా ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు వేర్వేరుగా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టాలని జీవోలో పేర్కొన్నారు. అభ్యర్థి కౌన్సెలింగ్​లో సీటు వచ్చిన తర్వాత కచ్చితంగా ఆ కళాశాలలో జాయిన్ కావాలని జీవోలో తెలిపారు. అభ్యర్థులు కాలేజీ ఆప్షన్ ఎంచుకునేటప్పుడు వరుసలో అన్ని కాలేజీలు ఎంపిక చేసుకోవచ్చన్నారు.

కరోనా వ్యాప్తి జరుగుతున్న కారణంగా ఆన్​లైన్​లోనే కౌన్సెలింగ్ ప్రక్రియ జరుతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉన్నతాధికారులు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని.. కమిటీలో ఇద్దరు ఐఏఎస్​లతో పాటు విద్యావేత్తలు ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ప్రవేశ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్​సైట్​లో పొందుపరిచారు. 250 పైగా అభ్యంతరాలు వచ్చినట్లు వర్శిటీ అధికారులు చెపుతున్నారు. వీటన్నింటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను పొందుపరుస్తామని అధికారులు తెలిపారు. అనంతరం అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆప్షన్లు పెట్టుకోవచ్చని తెలిపారు. ఇవాళ తుది మెరిట్ జాబితాను ఉంచే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి విద్యార్ధులకు అప్షన్లు పెట్టుకునే అవకాశాన్ని కల్పించనున్నారు

ఇవీ చదవండి: 'అప్పటి వరకు యూజీ కోర్సులు ప్రారంభించవద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.