ETV Bharat / state

గన్నీ బ్యాగుల కొనుగోళ్లలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం చర్యలు

ధాన్యం సేకరణ కోసం గన్నీబ్యాగుల కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టి సర్కార్ ఖజానాకు నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పౌరసరఫరాల సంస్థకు చెందిన గన్నీబ్యాగులను బయట విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అటు మిల్లర్లు, డీలర్లు కూడా సంస్థకు విధిగా బ్యాగులు తిరిగిచ్చేలా నిబంధనలను కఠినతరం చేయనున్నారు.

Government measures to curb irregularities in the procurement of gunny bags
గన్నీ బ్యాగుల కొనుగోళ్లలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం చర్యలు
author img

By

Published : Sep 25, 2020, 4:56 AM IST

రైతులు పండించిన వరి ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాల సంస్ధ ప్రతి సీజన్ లోనూ గన్నీబ్యాగులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మార్గదర్శకాలకు లోబడి 46శాతం పాత వాటిని, 54 శాతం కొత్త వాటిని వినియోగించాల్సి ఉంటుంది. కొత్త వాటిని జ్యూట్ కమిషన్ ద్వారా కొనుగోళ్లు చేయాలి. కొత్త బ్యాగులనైతే మూడు మార్లు, పాత బ్యాగులనైతే ఒక మారు ఉపయోగించే అవకాశం ఉంటుంది. జూట్ కమిషన్ ద్వారా కొనుగోలు చేసే ఒక్కో గన్నీబ్యాగు ధర 56 రూపాయలు ఉంటుంది. అదే పాత బ్యాగులను కొనుగోలు చేస్తే ఒక్కొక్కటి 24 నుంచి 26 రూపాయల వరకు పడుతుంది. జూట్ కమిషన్ నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసిన గన్నీ బ్యాగులోనే మిల్లర్లు బియ్యాన్ని అందించాల్సి ఉంటుంది. రేషన్ డీలర్లు బియ్యాన్ని వినియోగదారులకు అందించాక ఆ గన్నీబ్యాగును తిరిగి పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాలి. డీలర్ల నుంచి సంస్థకు రాకుండా మధ్యదళారులు చక్రం తిప్పుతారు. డీలర్ల నుంచి 22, 23 రూపాయలకు వాటిని దళారులు కొనుగోలు చేసి పౌరసరఫరాల సంస్థకు టెండర్ ద్వారా 24 నుంచి 26 రూపాయల వరకు అమ్ముతారు. దీంతో సంస్థపై ఆరు నుంచి ఎనిమిది రూపాయల వరకు అదనపు భారం పడుతుంది.

పౌరసరఫరాల సంస్థకు అదనపు భారం

తద్వారా పౌరసరఫరాల సంస్థకు ప్రతి సీజన్ లో 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. దీంతో ఆ భారం పడకుండా చూసే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల మిల్లర్లు, డీలర్ల అసోసియేషన్లతో మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై విస్తృత చర్చ జరిగింది. సంస్థపై అదనపు భారం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాత గన్నీ బ్యాగుల సరఫరాదార్లతోనూ చర్చించారు. ఇక నుంచి మిల్లర్లు, డీలర్ల నుంచి గన్నీబ్యాగులు విధిగా తిరిగివచ్చేలా నిబంధనలు కఠినతరం చేయనున్నారు. ఇదే సందర్భంలో పౌరసరఫరాల సంస్థ కొనుగోళ్లు చేసి మిల్లర్లు, డీలర్లకు ఇచ్చే గన్నీబ్యాగులను బయట విక్రయించకుండా చర్యలు తీసుకునే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది.

ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాగులు అవసరం

వానాకాలం సీజన్​లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి వస్తుందని ఓ అంచనా. ఎఫ్​సీఐ నిబంధనల ప్రకారం సంస్థ వద్ద ప్రస్తుతం ఉన్న ఐదు కోట్లకు తోడు మరో ఎనిమిది కోట్లకు పైగా కొత్త గన్నీబ్యాగులను కొనాల్సి వస్తుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూట్ కమిషన్ అన్ని గన్నీ బ్యాగులను అందించే పరిస్థితి లేదని అంటున్నారు. అదే జరిగితే ఓపెన్ టెండర్ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాలకు ఇదే తరహాలో అనుమతి ఇచ్చారని చెప్తున్నారు.

ఇవీ చూడండి: 'వ్యవసాయ రంగంలో వాటి సేవలు ఉపయోగించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.