ETV Bharat / state

రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు - అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు

పంచాయతీల వారీగా నిరక్షరాస్యులు ఎంత మంది ఉన్నారో తాజా లెక్కలు సేకరించేందుకు సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచే లక్ష్యంతో ప్రతీ అక్షరాస్యుడు మరో నిరక్షరాస్యుడికి చదువు నేర్పే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో త్వరలోనే సర్వేకు శ్రీకారం చుట్టనుంది. విద్య, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు ఈ సర్వేలో భాగస్వాములు కానున్నాయి.

government-is-working-towards-increasing-literacy-in-the-telangana-state
రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు
author img

By

Published : Jan 2, 2020, 8:37 AM IST

రాష్ట్రంలో ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారో సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం విద్య, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా తాజా గణాంకాలు ఉంటే అక్షరాస్యత కార్యక్రమంపై కార్యాచరణ రూపొందించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.

దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ సగటు అక్షరాస్యత 72.99 శాతం. తెలంగాణ రాష్ట్రంలో అది 66.54 శాతమే. అంటే ఇంకా ఆరున్నర శాతం తక్కువ. తెలంగాణ కంటే వెనుకబడిన రాష్ట్రాలు ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, బిహార్‌ మాత్రమే. కేంద్రపాలిత ప్రాంతాలనూ కలిపితే రాష్ట్రం 32వ స్థానంలో నిలిచింది. అన్ని రంగాల్లో ముందున్నా అక్షరాస్యత శాతంలో బాగా వెనుకంజలో ఉండటంతో జాతీయస్థాయిలో రాష్ట్రంపై చిన్నచూపు ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

2021లో జరిగే జనాభా లెక్కల్లో అక్షరాస్యత శాతం వెల్లడవుతుంది. అప్పుడు సైతం రాష్ట్రం వెనుకబడితే మళ్లీ దశాబ్దంపాటు విద్యావేత్తలు, మేధావులు ఇదే విషయాన్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. జాతీయస్థాయిలో తెలంగాణపై చులకనభావం ఏర్పడుతుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ఆలోగా ఒక ప్రజా ఉద్యమంలా అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 1.04 కోట్ల మంది నిరక్షరాస్యులున్నారు. వారిలో 15-49 మధ్య వయసు ఉన్న నిరక్షరాస్యులు 60 లక్షల మంది.

ఆశించింది 75..నమూనా సర్వేలో తేలింది 72.80 శాతమే

వచ్చే జనాభా లెక్కల నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 75కు చేరుకుంటుందని వయోజన విద్యాశాఖ అంచనా వేసింది. అయితే ఇటీవల జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌) నివేదిక ప్రకారం రాష్ట్రంలో అది 72.80 శాతమే ఉన్నట్లు తేలింది. అప్పటికీ జాతీయ సగటు(77.70) కంటే దాదాపు 5 శాతం తక్కువ ఉన్నట్లే. అందుకే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలకు భిన్నంగా ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌కు శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నందున మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను మినహాయించి గ్రామాల్లో త్వరలోనే సర్వే ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఒకే ఇంట్లో అక్షరాస్యులు, నిరక్షరాస్యులున్నారు... ఒకవేళ ఆ ఇంట్లో చదువుకున్న వారు లేకుంటే పొరుగింటి వారిచే అక్షరాస్యులుగా మారుస్తామని ఆయన తెలిపారు.

10 లోగా జాబితాలు సిద్ధం చేయాలి

నిరక్షరాస్యుల జాబితాలను ఈ నెల 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం గురువారం నుంచి మొదలవుతున్న సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడి బీఆర్‌కేఆర్‌ భవనం నుంచి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వయోజనుల అక్షరాస్యతను పెంచేందుకు గ్రామాల్లో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టాలని, నిరక్షరాస్యుల జాబితాలను గ్రామాల వారీగా రూపొందించాలని సీఎస్‌ సూచించారు. జాబితాలను 10వ తేదీ వరకు ఎదురు చూడకుండా ఏ రోజుకారోజు అప్‌డేట్‌ చేయాలన్నారు. పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, జనాభా లెక్కల సంచాలకులు ఇలంబర్తి, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రోనాల్డ్ రోస్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వరుసగా రెండో నెలలోనూ లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.