ETV Bharat / state

FURNITURE PARK: 300 ఎకరాల్లో ఫర్నిచర్‌ పార్కు.. కలప, కలపేతర ఉత్పత్తుల తయారీ - తెలంగాణలో భారీ ఆధునిక ఫర్నిచర్‌ పారిశ్రామిక పార్కు ఏర్పాటు

మేడ్చల్-సిద్దిపేట మార్గంలో 300 ఎకరాలలో అతిపెద్ద ఆధునిక ఫర్నిచర్ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మూడుచోట్ల స్థలాలను కూడా పరిశీలించింది. త్వరలోనే పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలుస్తోంది.

government-has-decided-to-set-up-a-furniture-park-on-300-acres
300 ఎకరాల్లో ఫర్నిచర్‌ పార్కు.. కలప, కలపేతర ఉత్పత్తుల తయారీ
author img

By

Published : Aug 30, 2021, 6:49 AM IST

తెలంగాణలో భారీ ఆధునిక ఫర్నిచర్‌ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడ్చల్‌-సిద్దిపేట మార్గంలో మూడు చోట్ల 300 ఎకరాల చొప్పున స్థలాలను పరిశీలించింది. త్వరలోనే పార్కుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. దీని ద్వారా భారీఎత్తున పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రాన్ని ఫర్నిచర్‌ హబ్‌గా మార్చాలని, దేశవిదేశాలకు చెందిన భారీ సంస్థలతో పాటు స్థానికంగా సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలను, వృత్తిదారులను ప్రోత్సహించాలని సంకల్పించింది. కలప, కలపేతర ఉత్పత్తులతో వినూత్న ఆకృతుల్లో ఫర్నిచర్‌, ఫర్నిషింగుల తయారీని ఇందులో ప్రోత్సహించనుంది. ఆదివారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో దీని ఏర్పాటు, ప్రోత్సాహకాలపై చర్చించినట్లు తెలిసింది.
తెలంగాణలో గత మూడేళ్లలో 40కి పైగా కలప ఆధారిత చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దాదాపు రూ. 210 కోట్ల మేర పెట్టుబడులతో ఉత్పత్తులు చేసి విక్రయిస్తున్నాయి. స్వీడన్‌కు చెందిన గృహోపకరణాలు, ఫర్నిచర్‌ విక్రయ సంస్థ ఐకియా దేశంలోనే అతిపెద్ద సముదాయాన్ని హైదరాబాద్‌లో 2018లో ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు, గృహ వినియోగాలకు కలిపి ఏటా రూ. 4 వేల కోట్ల మేర ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో కలప ఆధారిత వృత్తుల వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫర్నిచర్‌ పారిశ్రామిక పార్కు ద్వారా వారికి ఉపాధి లభించనుందని అంచనా.

చెట్లు నరకకుండానే...

చెట్లను నరకకుండా అందుబాటులో ఉన్న సాదా కలపను వినియోగించడంతో పాటు ట్రాపియోకా, పారావుడ్‌, రబ్బర్‌వుడ్‌, టింబర్‌వుడ్‌, బర్మాటేక్‌, వెదురు, ప్లైవుడ్‌, ఫైబర్‌, ఇనుము, స్టీలు, ఇతర లోహాలు, ప్లాస్టిక్‌, లెదర్‌ వంటి వాటితోనూ ఫర్నిచర్‌ చేయిస్తారు. వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తారు. ముడిసరకుల దిగుమతికి ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది. నిపుణుల ద్వారా శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుంది.

ప్రముఖ కంపెనీలకు ఆహ్వానం

పార్కులో భారీ సంస్థలతో పాటు... సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు, వృత్తిదారులకు ప్రభుత్వం స్థలాలను కేటాయించనుంది. ఫర్నిచర్‌ తయారీలో పేరొందిన థాయ్‌లాండ్‌, తైవాన్‌ పారిశ్రామికవేత్తలను ఫర్నిచర్‌ పార్కులో పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఆహ్వానించారు. గోద్రెజ్‌తో పాటు మరో నాలుగు కంపెనీలతోనూ చర్చించారు. ప్రభుత్వం వృత్తిదారుల కోసం పార్కులో ప్రత్యేక షెడ్లు నిర్మించనుంది. ప్రభుత్వ అవసరాలకు పార్కులో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేస్తుంది. ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. అధునాతన యంత్రాలు, సృజనాత్మకత, ఆకృతుల స్టూడియోతో పాటు ఉమ్మడి సౌకర్యాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. కార్మికుల కోసం ప్రత్యేక గృహ సముదాయం నిర్మిస్తుంది. నిర్మల్‌ తరహా చెక్కబొమ్మల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. ఉత్పత్తులకు వాడే ప్రత్యేక కలప మొక్కల పెంపకాన్ని కూడా పార్కులో చేపడుతుంది.

ఫర్నిచర్‌ రంగానికి భారీ డిమాండ్‌

ఫర్నిచర్‌ రంగానికి భారీ డిమాండ్‌ ఉంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సంస్థ ఐకియా అమ్మకాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ముడిసరకులతో పాటు ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీంతో అన్నిరకాల ఉత్పత్తులకు అవకాశం ఉంది. ఫర్నిచర్‌ పారిశ్రామిక పార్కు ద్వారా వృత్తిదారులతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి. - జయేశ్‌ రంజన్‌, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి

ఇదీ చూడండి: Cruel Mother: పసి బిడ్డపై మరీ ఇంత పైశాచికత్వమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.