ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail)ను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం (Ts Government) దృష్టిసారించింది. మెట్రోరైల్‌కి చెందిన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన కమిటీ.... ఎల్ అండ్ టీ సంస్థ ప్రస్తావించిన సమస్యలపై సమావేశంలో చర్చించింది. కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే ఎల్ అండ్ టీ (L&T) ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కి వివరించారు.
ఆర్థికంగా నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరగా సంస్థ లేవనెత్తుతున్న సమస్యలు, కోరుతున్న పరిష్కారాలు, వాటి ప్రభావంపై సుధీర్ఘంగా చర్చించారు. ఎల్ అండ్ టీ ప్రతినిధులతో మరోసారి సమావేశమై అన్నిఅంశాలపై విస్తృతంగా చర్చించాలని అధికారులకు మంత్రులు స్పష్టంచేశారు.
ఇదీ చదవండి: KTR On BJP Corporators GHMC Attack: 'గాడ్సే అభిమానులను గాంధీ మార్గంలో నడవమని కోరడం అత్యాశే'