ETV Bharat / state

ఐటీ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు ప్రకటించిన ప్రభుత్వం - ఐటీ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు

government-announces-it-grid-policy-guidelines
ఐటీ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు ప్రకటించిన ప్రభుత్వం
author img

By

Published : Dec 10, 2020, 7:03 PM IST

Updated : Dec 10, 2020, 7:41 PM IST

19:00 December 10

ఐటీ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు ప్రకటించిన ప్రభుత్వం

    ఐటీ పరిశ్రమలను నలుమూలలా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా బాహ్యవలయ రహదారి లోపలున్న 11 పారిశ్రామిక పార్కులను ఐటీ పార్కులుగా దశలవారీగా అభివృద్ధి చేస్తారు. వీటితో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరు లేదా ఉస్మాన్ సాగర్ పరిసరాల్లో మరొక ఐటీ పార్కును ఏర్పాటు చేస్తారు. మొత్తంగా నగరం, పరిసరాలు కలిపి.. ఏడు ఐటీ క్లస్టర్లుగా విభజించి.. అవసరమైన చర్యలు తీసుకుంటారు.

   గ్రిడ్ పాలసీలో భాగంగా ఇచ్చే ప్రోత్సాహకాలను హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్ రాంగూడ ప్రాంతాలలో మినహాయించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ప్రోత్సాహకాలుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఐటీపార్కుల అభివృద్ధి సహా.. వసతులు, రహదార్లు ఇతరాల కోసం అభివృద్ధి చేసే క్రమంలో నిబంధనలకు లోబడి పరిహారం ఇవ్వడం లేదా.. టీడీఆర్ విధానాన్ని అమలు చేస్తారు.

ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి

Last Updated : Dec 10, 2020, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.