SAJJALA ON AMARAVATI: మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తగిన సమయంలో శాసనసభలో బిల్లు ప్రవేశపెడతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈసారి పకడ్బందీగా మూడు రాజధానుల చట్టం తెస్తామన్నారు. న్యాయప్రక్రియకు లోబడే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు.
రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజధానికి సంబంధించి ప్రభుత్వం, వైసీపీ స్టాండ్‌కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ్టికి రాష్ట్ర రాజధాని అమరావతేనన్న సజ్జల.. భవిష్యత్తులో అమరావతి శాసన రాజధానిగానే ఉంటుందన్నారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు.
వివేకాని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడాలి: వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని వైఎస్ జగన్ కుటుంబం, వైసీపీ కోరుకుంటుందని సజ్జల తెలిపారు. తెలంగాణలో విచారణ జరిగినా తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ఎక్కడ దర్యాప్తు జరిగినా మంచిదేనన్న సజ్జల... వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులకు కఠినశిక్ష పడాలన్నదే తమ కోరికని అన్నారు.
ఒక్క సీటు లేని పవన్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారు?: పవన్ కల్యాణ్ పదిరోజులకో, నెలకోసారి వలస పక్షిలా రాష్ట్రానికి వచ్చి పోతున్నారన్న సజ్జల.. ఒక్క సీటు లేని పవన్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: