రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
దివ్యాంగుల విజయాలే సాధారణ యువతకు స్ఫూర్తి అని తమిళిసై అభిప్రాయపడ్డారు. వైకల్యం శరీరానికి తప్ప మనసుకుకాదన్న సత్యాన్ని గుర్తించి.. దివ్యాంగులు తమ జీవితంలో ముందుకెళ్లాలని గవర్నర్ సూచించారు. వేడుకలో దివ్యాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవీ చూడండి: 'అత్యాచార నిందితులను 6 నెలల్లోగా ఉరి తీయాలి'