ఓయూ అధ్యాపకులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని అధ్యాపకులకు గవర్నర్ సూచించారు. ముందుగా ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్నారు.
ఆన్‌లైన్ పరీక్షలకు సమగ్ర ప్రణాళిక, విధాన నిర్ణయాలు అవసరమని తమిళిసై ఓయూ అధ్యాపకులతో చర్చించారు. ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని... ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులకు పదునుపెట్టాలని గవర్నర్ అన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో పెరిగిపోయిన రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్