దక్షిణ భారతం అందాలు పేయింటింగ్‌లో చూస్తూ ఉత్కంఠకు గురయ్యాయని గవర్నర్ తమిళిసై తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన కశ్మీర్ ఆన్ క్యాన్వాస్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ముగింపు వేడుకలకు గవర్నర్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జమ్ము కశ్మీర్ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
చిత్రకారిణి శిరీష శ్రీనివాస్ రూపొందించిన చిత్రాలను గత నాలుగు రోజులుగా ప్రదర్శిస్తున్నారు. శిరీష శ్రీనివాస్.. క్యాన్వాస్ జాలువారిన చిత్రాలను అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అందించాలన్న లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
చిత్రాలను అమ్మగా 12 లక్షలు రాగా.. అందులో 6 లక్షలు తెలంగాణ పోలీసులకు మరో 6 లక్షలు జమ్ము కశ్మీర్ పోలీసులకు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్లు మరెన్నో నిర్వహించి పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తమిళిసై పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఆలయంలో తైలవర్ణ చిత్రాలు వేయించండి: సీఎం కేసీఆర్