ETV Bharat / state

నేను డాక్టర్​నే కాదు పెయింటర్​ను కూడా: తమిళి సై - గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్​

పురుషులు అధికంగా ఉన్న రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని గవర్నర్​ తమిళి సై పేర్కొన్నారు. రాజకీయాల్లో ఫొటో గ్రాఫర్స్​గా పురుషుల ఆధిపత్యం ఉండేదని.. ప్రస్తుతం అతివల సంఖ్య పెరిగిందన్నారు. ​అయితే వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

నేను డాక్టర్​నే కాదు పెయింటర్​ను కూడా: తమిళి సై

author img

By

Published : Mar 13, 2020, 11:35 PM IST

నేను డాక్టర్​నే కాదు పెయింటర్​ను కూడా: తమిళి సై

ఒకప్పుడు పురుషులు అధికంగా ఉండే రంగాల్లో... ప్రస్తుతం మహిళల సంఖ్య పెరుగుతుందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ అభిప్రాయపడ్డారు. మహిళలు ఇంతటితో తృప్తి చెందకుండ మరింతంగా ఆయా రంగాల్లో తమ నైపుణ్యలను పెంచుకోవాలని ఆమె సూచించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారించుకొని 22 మంది మహిళా ఫోటోగ్రాఫర్స్‌ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనున తమిళి సై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టండి:

రాజకీయాల్లో లాగా ఫొటో గ్రాఫ్‌ర్స్‌గా పురుషుల ఆధిపత్యం ఉండేందని... ఇప్పుడు మహిళల సంఖ్య పెరిగిందని గవర్నర్​ తమిళి సై పేర్కొన్నారు. అతివలు ఆ రంగాల్లో రాణించడం సంతోషంగా ఉన్నా.. వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. వైద్యురాలుగానే కాకుండ ఒక చిత్రకారిణిగా ఈ ప్రదర్శనకు రావడం ఆనందంగా ఉందన్నారు. వనితల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలన్నారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు.

ఇదీ చూడండి: జగిత్యాలలో ఓ యువకునికి కరోనా లక్షణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.